రాత్రిపూట శోభన్ బాబు గదికి ఆ హీరోయిన్.. దర్శకుడి సంచలన వ్యాఖ్యలు

తెలుగువారి అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు. ఎన్నో మరిచిపోలేని పాత్రలకు జీవం పోసి, ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు శోభన్. ఇద్దరు భార్యల మధ్యలో నలిగిపోయే పాత్రల్లో నటించి మహిళా ప్రేక్షకుల ఆరాధ్య నటుడిగా నిలిచారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీలకు, నవలా చిత్రాలకు శోభన్ బాబు ట్రెండ్ సెట్టర్. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఆయన .. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏకధాటిగా పనిచేసేవారు. ఆరు గంటలు దాటిన తర్వాత ఎట్టిపరిస్ధితుల్లోనూ ఇంట్లో ఉండాల్సిందే. భార్యాబిడ్డలతో గడపటంతో పాటు శరీరానికి తగినంత విశ్రాంతి ఉండాలని తనకు తానే ఓ కఠిన నిబంధన పెట్టుకున్నారు.

సినీ వినీలాకాశంలో ధ్రువతారలుగా వెలుగొందుదామని వచ్చిన నటీనటులు చివరి రోజుల్లో పడిన కష్టాలను గుణపాఠాలుగా నేర్చుకుని కష్టపడిన ప్రతి పైసాను పొదుపు చేశారు. భూమిని నమ్మినవాడు ఎన్నటికీ నష్టపోడనే సిద్ధాంతాన్ని నమ్మి.. తన సంపాదనను రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారు.

writer and director Kanagala Jayakumar made sensational comments on sobhan babu video goes viral

అప్పట్లో శోభన్ బాబు కొన్న భూముల విలువ ఇప్పుడు వందల రెట్లు పెరిగిపోయాట. భారతదేశంలో సినీ పరిశ్రమ పరంగా రిచ్చెస్ట్ పర్సన్ శోభన్ బాబు ఒక్కరేనని మురళీ మోహన్ వంటి వారు తెలిపారంటే ఆయన ముందు చూపును అర్ధం చేసుకోవచ్చు.

క్రమశిక్షణతో జీవితాన్ని , కెరీర్‌ను నడిపిన శోభన్ బాబు దాదాపు 220కి పైగా సినిమాల్లో నటించి తన 59వ ఏట నటజీవితానికి స్వస్తి పలికారు. చెన్నైలో తన కుటుంబ సభ్యులతో శేష జీవితాన్ని ఆనందంగా గడిపారు. రిటైర్మెంట్ తర్వాత ఏ ఫంక్షన్‌లోనూ, మీడియాలోనూ శోభన్ బాబు కనిపించలేదు. తనను ప్రేక్షకులు ఎలా చూశారో చివరి వరకు అదే రూపం వాళ్ల మనసులో ఉండాలని చెప్పేవారట శోభన్. 2008 మార్చి 20 ఉదయం 10.50 గంటలకు చెన్నైలో తుదిశ్వాస విడిచారు శోభన్ బాబు.

writer and director Kanagala Jayakumar made sensational comments on sobhan babu video goes viral

కెరీర్‌లో ఎంతోమంది హీరోయిన్లతో ఆయన కలిసి నటించారు . అయితే శారద, జయలలిత , చంద్రకళ, జయప్రద, జయసుధ, శ్రీదేవిలతో శోభన్ బాబు ఎక్కువగా నటించారు. అసలే మగాళ్లు సైతం అసూయ పడేటంత అందాల నటుడు కావడంతో నాటి సినిమా పత్రికల్లో రకరకాల ఊహాగానాలు వచ్చేవి. ఈ నేపథ్యంలో ప్రముఖ రచయిత, దర్శకుడు కనగాల జయకుమార్.. శోభన్ బాబుకు క్లోజ్ ఫ్రెండ్ కావడంతో ఓ ఇంటర్వ్యూలో ఆయనకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.

సంపూర్ణ రామాయణం సినిమా షూటింగ్ సమయంలో శోభన్ బాబు చాలా క్లోజ్ అయ్యారని .. తనను ఎప్పుడూ రూమ్‌కి పిలిచేవారని, ఏదైనా పాట పాడమని చెప్పేవారని జయకుమార్ తెలిపారు. ఈ చిత్రంలో సీత క్యారెక్టర్‌లో చంద్రకళ నటించారని.. అయితే ఆమె శోభన్ బాబు రూమ్ పక్కనే ఉండేదని.. తనకు బోర్ కొట్టి ఏమీ తోచకపోతే వెంటనే శోభన్ గదికి వచ్చేదని జయకుమార్ పేర్కొన్నారు.

దీనిని గమనించిన శోభన్ బాబు తరచూ చంద్రకళ తన గదికి వచ్చిపోతుండటం ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారని ఫీలయ్యారని.. అదే విషయాన్ని చంద్రకళ మొహం మీదే చెప్పారని వెల్లడించారు. శోభన్ బాబు చాలా హుందాగా ఉండేవారని, ఏ హీరోయిన్ వంకా కన్నెత్తి చూసేవారు కాదని అలాంటిది నాటి అగ్ర కథానాయిక, దివంగత తమిళనాడు సీఎం జయలలితతో ప్రేమలో పడటం తనకే ఆశ్చర్యం కలిగించిందని జయకుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: sobhan babu chandrakala
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X