టాలీవుడ్ లేడి డైరెక్టర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. క్లారిటీ ఇచ్చిన కోన వెంకట్!
రాజ్ తరుణ్ రాజు గాడు సినిమాతో దర్శకురాలిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న లేడి డైరెక్టర్ సంజనా రెడ్డి. అయితే ఆమె ఆరోగ్యం విషమంగా ఉందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వచ్చాయి. రీసెంట్ గా ఆమె ఆస్పత్రిలో చేరినట్లు అలాగే ఆరోగ్యం క్షిణించడం వలన ఆమెను ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉంచినట్లు కథనాలు వెలువడ్డాయి.

ఆరోగ్య పరిస్థితి..
వెంటిలేటర్ పై ఉంచడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని సోషల్ మీడియాలో కూడా వార్తల డోస్ పెరగడంతో ప్రముఖ రైటర్, నిర్మాత కోన వెంకట్ క్లారిటీ ఇచ్చారు. సంజన రెడ్డి నెక్స్ట్ కోన వెంకట్ ప్రొడక్షన్ లో ఒలింపిక్ వెయిట్ లీఫ్టింగ్ ఛాంపియన్ కరణం మల్లీశ్వరి బయోపిక్ ని తెరకెక్కించబోతోంది. ఇటీవల కోన వెంకట్ ఆ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు.

క్లారిటీ ఇచ్చిన కోన వెంకట్..
అయితే ప్రస్తుతం ఆ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్న సమయంలో సంజనా రెడ్డి ఊహించని విదంగా అనారోగ్యానికి గురైంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు కోన వెంకట్ తెలియజేశారు. అలాగే త్వరలో ఆమె డిశ్చార్జ్ అవుతారని కూడా ఆయన తెలియజేశారు. ఇక త్వరలోనే కరణం మల్లీశ్వరి బయోపిక్ తెరపైకి రాబోతోంది. ఇప్పటికే సంజనా ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారు.

ఆ మల్లీశ్వరి ఎవరు..?
అసలైతే సమ్మర్ లోనే ఆ బయోపిక్ ని స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా వర్కౌట్ కాలేదు. ఇక సినిమాలో కరణం మల్లీశ్వరిగా ఎవరు కనిపిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలుగు జాతి గర్వపడేలా వెయిట్ లీఫ్టింగ్ లో ప్రపంచాన్ని ఆకర్షించిన ఆమె బయోపిక్ లో నటించే ఆ నటీమణి గురించి తెలుసుకోవాలని ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Recommended Video

రిజెక్ట్ చేసిన నిత్యమీనన్
రైటర్ కోన వెంకట్ కరణం మల్లీశ్వరి బయోపిక్ ని తెరకెక్కించాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో మల్లీశ్వరి పాత్ర కోసం మొదట నిత్యమీనన్ ని అనుకున్నారు. అమెతో కొన్ని రోజుల పాటు దర్శకురాలు సంజనా రెడ్డి కథపై చర్చలు కూడా జరిపిందట. కానీ ఎందుకో నిత్య ఒప్పుకోలేదట. గతంలో మహానటి సినిమాను కూడా ఈ బ్యూటీ రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











