twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Krack కాపీ వివాదంలో రవితేజ మూవీ.. రిలీజైన ఏడాది తర్వాత కేసు?

    |

    ఈ మధ్య కాలంలో సినిమాల మీద వస్తున్న కాపీ వివాదాలు అన్నీఇన్నీ కావు. సినిమా కథ నాదే అని కొంత మంది రచయితలు మీడియా ముందుకు వస్తుంటే పాటలు విడుదలయ్యాక పాటలు ఫలానా చోట నుంచి కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. క్రాక్ సినిమా విడుదలై సుమారు ఏడాది పైగా పూర్తయిన తర్వాత ఆ సినిమా కథ తనదేనని ఓ రచయిత పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అల్లు రాళ్ల కి వెళ్తే

    రియల్ స్టోరీ

    రియల్ స్టోరీ

    చాలా కాలం హిట్ సినిమా లేక ఇబ్బందులు ఎదుర్కొన్న రవితేజ కు క్రాక్ లాంటి సినిమాతో సూపర్ హిట్ అందించారు గోపీచంద్ మలినేని. ముందు నుంచి కూడా ఒంగోలు పరిసర ప్రాంతాల్లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం అని ఆయన ప్రచారం చేస్తూ వచ్చాడు. అందుకు అనుగుణంగానే సినిమాలో పాత్రధారులైన వారిని నిజ జీవితంలో మీడియా ఇంటర్వ్యూలు కూడా చేసింది.

     పోలీసులకు ఫిర్యాదు

    పోలీసులకు ఫిర్యాదు


    అప్పట్లో రౌడీలుగా బ్రతికి తర్వాత కాలంలో సాధారణ జీవితం గడుపుతున్న వారి గురించి మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా విడుదలయినా ఏడాది తర్వాత ఆ సినిమా కథ తనదేనని తనను మోసం చేసి సినిమా తీశారని చెబుతూ క్రాక్ సినిమా నిర్మాత సహా యూనిట్ సభ్యుల మీద చీటింగ్ కేసు నమోదు చేయాలి అంటూ ఒక రచయిత జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    పుస్తకంలో ఉన్నవే

    పుస్తకంలో ఉన్నవే

    అల్వాల్ అనే ప్రాంతంలో నివాసం ఉంటున్న శివసుబ్రమణ్యం మూర్తి అనే ఒక వ్యక్తి 2015 సంవత్సరంలో బల్లెం సినిమా మీడియా డైరెక్టరీ అనే పుస్తకాన్ని రాశారట.అయితే ఏడాదిన్నర క్రితం రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో సన్నివేశాలు, కథ, కథనం మొత్తం పుస్తకంలో ఉన్నవే అంటూ సదరు రచయిత ఆరోపిస్తున్నారు.

    నోటీసులు పంపినా

    నోటీసులు పంపినా

    ఈ విషయం మీద నిర్మాణ సంస్థతో పాటు దర్శకుడికి, నిర్మాతకు, హీరోకి ఫిలిం ఛాంబర్ నుంచి నోటీసులు పంపినా పట్టించుకోవడంలేదని సుబ్రహ్మణ్యం మూర్తి ఆరోపిస్తున్నారు. ఈ సినిమా నిర్మాత మధుసూదన్ రెడ్డి జూబ్లీహిల్స్లోని ప్రశాసన్ నగర్ లో నివాసం ఉంటున్నారు కాబట్టి తాను జూబ్లీహిల్స్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా ఎంత అద్భుతమైన విజయాన్ని అందుకున్న ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు..

    ఎలా స్పందిస్తారు?

    ఎలా స్పందిస్తారు?

    1990వ దశకంలో ఒంగోలులో జరిగిన కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా చేస్తున్నామని సినిమా ప్రకటించినప్పుడే దర్శకుడు గోపీచంద్ మలినేని వెల్లడించారు.. అయితే ఇప్పుడు ఈ రచయిత తన కథను కాపీ కొట్టారని ఆరోపించడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ విషయం మీద పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఒకవేళ పోలీసుల నుంచి ఏవైనా నోటీసులు వస్తే సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని, హీరో రవితేజ, నిర్మాత మధుసూదన్ రెడ్డి ఎలా స్పందించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

    English summary
    a writer named siva subrahmanyam murthy filed a case on krack makers, alleging that they copied story from his book.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X