Don't Miss!
- News
తీన్మార్ మల్లన్న అరెస్ట్.. జీవో రద్దు చేసేవరకు పోరాడుతాం: మల్లన్న
- Sports
IPL 2022: తూ.. దీనమ్మ జీవితం..ఫైనల్కు పోయిన ఆనందం కూడా లేదు!
- Finance
తెలంగాణలో యూరియా ప్లాంట్ను తెరిపించింది మేమే: మోడీ: రూ.8 లక్షల కోట్లు
- Automobiles
భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరోసారి డైరెక్షన్ లోకి రాజమౌళి తండ్రి.. ఆ బిగ్ సీక్వెల్ సాధ్యమయ్యే పనేనా?
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో దర్శకులతో పాటు హీరోలు కూడా చాలామంది భారీ స్థాయిలో సినిమాలు చేస్తున్నారు. ఇక రైటర్స్ కూడా అగ్ర స్థాయిలో వారి పెన్ పవర్ ను చూపిస్తున్నారు. అందులో కె.విజయేంద్ర ప్రసాద్ టాప్ లిస్టులో ఉన్నారు. రాజమౌళి తండ్రి కె.విజయేంద్ర ప్రసాద్ మొదటి నుంచి కూడా సక్సెస్ ఫుల్ కథలను అందిస్తూ వస్తున్నారు. స్టార్ హీరోలకు బిగ్ స్టోరీస్ అంధించడంలో ఆయన ముందున్నారు. ఇక బాహుబలి అనంతరం ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బిజీ అవుతున్నారు. రాజమౌళి ప్రతీ సినిమాకు కూడా కథను అందిస్తున్న ఆయన సల్మాన్ ఖాన్ వంటి స్టార్ కు కూడా కథను అందిస్తున్నారు.
ఇదివరకే బజరంగీ భాయీజాన్ సినిమా కథను అంధించగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లను అందుకుంది. కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా టాప్ ఇండియన్ బాక్సాఫీస్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక బజరంగీ భాయీజాన్ సినిమాకు కూడా సీక్వెల్ రానున్నట్లు ఇటీవల RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా కథను కె.విజయేంద్రప్రసాద్ అంధించనున్నట్లు తెలియజేశారు. ఇక బజరంగీ భాయీజాన్ 2 కథను ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయంలో ఇంకా అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆ సినిమాను కె.విజయేంద్ర ప్రసాద్ డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా టాక్ వస్తోంది.

79 ఏళ్ళ వయసులో కూడా కె.విజయేంద్ర ప్రసాద్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటారని రాజమౌళి చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఇక ఆయన రచయితగా మంచిగా క్రేజ్ అనుకున్న సమయంలోనే 1996లో అర్థాంగి అనే సినిమాను డైరెక్ట్ చేశాడు. అయితే ఆ సినిమా ఆర్థిక కారణాల వలన పూర్తి అవ్వలేదు. ఇక 2006లో శ్రీకృష్ణ అనే సినిమాను డైరెక్ట్ చేసిన ఆయన బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అందుకున్నారు. ఇక మళ్ళీ 2011లో రాజన్న అనే సినిమాని డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనే విదంగా విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకు మంచి ప్రశంసలు కూడా అందాయి. ఇక చివరగా 2017లో చేసిన శ్రీవల్లి సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అందుకుంది.
ఇక మొత్తానికి మళ్ళీ గత ఏడాది మరొక సినిమాను డైరెక్ట్ చేయాలని అనుకున్నారు కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు బజరంగీ భాయీజాన్ సినిమాకు సీక్వెల్ ను డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ మీడియాలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు అగాల్సిందే. ఇక కె.విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం రామాయణం బ్యాక్ డ్రాప్ లో సీత పాత్ర గురించి ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే రౌడి రాథోడ్ 2 సినిమాకు కూడా సీక్వెల్ కథను అందిస్తున్నాడు. అంటే విక్రమార్కుడు కథకు కొనసాగింపుగా స్టోరీ రాయనున్నట్లు సమాచారం.