SSMB29: మహేష్ రాజమౌళి సినిమాపై షాకింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ రైటర్!

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమా SSMB29 కోసం కేవలం ఇండియన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా మంది సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు అని చెప్పవచ్చు.RRR సినిమాతో విదేశీ సినీ లవర్స్ ను కూడా ఎంతగానో ఆకర్షించిన రాజమౌళి తప్పకుండా మహేష్ బాబు సినిమాతో హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు అని అనిపిస్తోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ ఎంతవరకు వచ్చింది అలాగే సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో ఇదివరకే చాలా రకాల రూమర్లు వినిపించాయి. ఇక మొత్తానికి రైటర్ ద్వారా ఒక క్లారిటీ వచ్చింది.

writer k vijayendra prasad latest clarification on SSMB 29 project

అప్పట్లోనే ఒక క్లారిటీ: ప్రాజెక్టు గురించి అధికారికంగా క్లారిటీ ఇచ్చిన తర్వాత కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ అయితే ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉంటుంది అని తప్పకుండా మహేష్ రాజమౌళి కలయికలో వచ్చే సినిమా ఎలా ఉండాలని అనుకుంటున్నారో అంతకుమించి అని ఎలా ఉంటుంది అని కూడా ఆయన వివరణ ఇచ్చారు. అయితే మళ్లీ ఈ సినిమా మొదలవడానికి చాలా సమయం పట్టవచ్చు అని కూడా ఇటీవల కొన్ని రూమర్స్ వచ్చాయి.

writer k vijayendra prasad latest clarification on SSMB 29 project

ఈ ఏడాది చివర్లోనే: ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి తండ్రి, కథ రచయిత విజయేంద్రప్రసాద్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమాను ఈ ఏడాది చివర్లోనే ప్రాజెక్ట్ మొదలు పెట్టె ప్రయత్నాలు చేయబోతున్నట్లుగా ఆయన వివరణ ఇచ్చారు.

ప్రస్తుతం స్క్రిప్టు పనులు అయితే కొనసాగుతున్నాయి అని ఇక సినిమాకు సంబంధించిన కొన్ని ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్లో మాత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా ఆయన వివరణ ఇచ్చారు.

writer k vijayendra prasad latest clarification on SSMB 29 project

త్రివిక్రమ్ సినిమా కారణంగా?: గతంలో కూడా రాజమౌళి ఇదే తరహాలో ఒక ప్రణాళికను రచించుకున్నాడు. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా కారణంగా మళ్ళీ రాజమౌళి సినిమా ఏమైనా ఆలస్యంగా మొదలవుతుందేమో అని అందరూ అనుకుంటున్నారు.

కానీ రాజమౌళి మహేష్ మాత్రం పక్క ప్రణాళికతోనే ప్రాజెక్టును స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక రాజమౌళి ఎప్పటిలానే ప్రస్తుతం తన అసిస్టెంట్లతో అలాగే తండ్రి విజయేంద్రప్రసాద్ తో ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులలో చాలా బిజీగా ఉన్నాడు.

writer k vijayendra prasad latest clarification on SSMB 29 project

మహేష్ ఫిక్స్ అయ్యాడు: కంప్లీట్ స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్డేట్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నారు. వర్క్ షాప్ కూడా ఉంటుంది ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ ప్రాజెక్టును ఈ ఏడాది అక్టోబర్ లోపు ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే.

ఇక ఆ తర్వాత కంప్లీట్ గా మహేష్ ఎలాంటి కమిట్మెంట్స్ పెట్టుకోకుండా రాజమౌళి సినిమాకే ఏడాదికి పైగా డేట్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. రాజమౌళి ప్రాజెక్టు ఫినిష్ అయ్యేంతవరకు కూడా మరో ప్రాజెక్టు గురించి ఆలోచించకూడదు అని కూడా మహేష్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X