ఆ చెత్త సీన్స్ వల్లే నాగార్జున సినిమా ఫ్లాప్ .. సంచలన విషయం బయటపెట్టిన స్టార్ రైటర్
తెలుగు చిత్ర పరిశ్రమలో రోమాంటిక్ హీరో ఇమేజ్ కొంతమందికే ఉంది. వారిలో కింగ్ నాగార్జున ఒకరు. దిగ్గజ నటుడు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా చిత్రసీమలో ఎంట్రీ ఇచ్చిన నాగ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తొలితరం సూపర్‌స్టార్స్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ , శోభన్ బాబు, కృష్ణంరాజుల తర్వాత దశాబ్థాలుగా తెలుగు చిత్ర పరిశ్రమను నాలుగు స్తంభాలుగా మోస్తున్న ఒకరిగా నాగ్ స్థానం సంపాదించారు. మాస్ చిత్రాలతో యువతకు పూనకాలు తెప్పించినా, భక్తిరస చిత్రాలతో ప్రజలను భక్తి పారవశ్యంలో ముంచెత్తినా నాగార్జునకే చెల్లింది.
అమ్మాయిల కలల రాకుమారుడిగా, యువ సామ్రాట్‌గా , రొమాంటిక్ స్టార్‌గా తెరపై సందడి చేశారు నాగ్. రోటిన్ మాస్ మసాలా సినిమాలు కాకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథల్లో నటిస్తూ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా పాత్రలు చేస్తూ న్యూటాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ సెల్యూలాయిడ్ సైంటిస్ట్‌గా కింగ్ గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలే కాకుండా బుల్లితెరపై హోస్ట్‌గానూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. 60 ప్లస్‌లోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో.. నవ మన్మథుడిగా , కుర్రాళ్లే అసూయ పడేంత అందంతో అలరిస్తున్నారు.

దాదాపు మూడున్నర దశాబ్ధాలకు పైగా కెరీర్‌లో నాగార్జున నటించిన పాత్రలు వేటికవే ప్రత్యేకంగా. వీటిలో ఎన్నో ట్రెండ్ సెట్టర్స్ ఉన్నాయి. ప్రతిభావంతులకు బాసటగా నిలుస్తూ ఎందరో హీరోలు, హీరోయిన్లు, దర్శకులు , సాంకేతిక నిపుణులను తెలుగు తెరకు పరిచయం చేశారు నాగ్. ఇక కామెడీ టైమింగ్ విషయంలోనూ ఆయనది డిఫరెంట్ స్టైల్. ఈ నేపథ్యంలో కామెడీ చిత్రాల స్పెషలిష్ట్ శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన కింగ్ సినిమాలో నాగార్జున నటించారు.
త్రిష , మమతా మోహన్ దాస్, శ్రీహరి సహా తెలుగు తెరపై మొత్తం స్టార్ కమెడియన్లతో సినిమాను నింపేశారు శ్రీను వైట్ల. క్రిస్మస్ కానుకగా 25 డిసెంబర్ 2008న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం అందుకోలేదు. అయితే కింగ్ మూవీలో నాగార్జున - బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్ నేటికీ కడుపుబ్బా నవ్విస్తాయి. సోషల్ మీడియాలో వేలాది మీమ్స్ ఈ సినిమాకు చెందినవే ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాలో రాజా చంద్ర ప్రతాప్ వర్మగా, బొట్టు శీను, శరత్‌గా మూడు డిఫరెంట్ రోల్స్‌లో నాగార్జున కనిపిస్తారు.

దాదాపు 16 ఏళ్ల తర్వాత కింగ్ సినిమా ఫ్లాప్ కావడానికి కారణాలను బయటపెట్టారు ఈ చిత్ర రచయిత కోన వెంకట్. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నప్పటికీ.. సెకండాఫ్ స్లో కావడంతో సినిమా లైన్ తప్పిందని తెలిపారు. కొన్ని అనవసరమైన సీన్లు పెట్టడం కొంపముంచిందని.. ముఖ్యంగా బొట్టు శ్రీను, కింగ్ క్యారెక్టర్లు ప్రేక్షకులను కన్‌ఫ్యూజ్ చేశాయని కోన వెంకట్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











