twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'చందమామ' తెర వెనుక కధ...ఉత్తేజ్ కోయదొర వేషం వెనుక సీక్రెట్ బయట పెట్టిన రచయిత

    |

    సినిమా ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టిన ఉత్తేజ్ తరువాతి కాలంలో బిజీ నటుడిగా మారారు. అనేక సినిమాల్లో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అనేక పాత్రలలో నటించిన ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కొండలరావు అనే పాత్రలో కోయదొర మారువేషం వేసి నటించి ఆకట్టుకున్నాడు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రచయిత లక్ష్మీ భూపాల్ కోయదొర పాత్రకు సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    ఉత్తేజ్ పుట్టినరోజు సంధర్భంగా

    ఉత్తేజ్ పుట్టినరోజు సంధర్భంగా

    2007లో చందమామ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలో నటనకు గాను ఉత్తేజ్ ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు సైతం సొంతం చేసుకున్నారు. ఆ సినిమా వెనుక, కొండల్ రావు అనే ఆ పాత్ర వెనుక ఉన్న ఆసక్తికర అంశాలు ఉన్నాయని వాటిని తాజాగా రచయిత లక్ష్మీ భూపాల్ ఈరోజు పంచుకున్నారు. ఈరోజు ఉత్తేజ్ పుట్టినరోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూనే, అసలు ఉత్తేజ్ తో తనకు ఎలా పరిచయం అయ్యారు అనే విషయాలను కూడా లక్ష్మీ భూపాల్ పంచుకున్నారు.

    వజ్రోత్సవాలతో పరిచయం

    వజ్రోత్సవాలతో పరిచయం

    2007లో తెలుగు సినిమా వజ్రోత్సవాలు ఈవెంట్ లో ఒక స్కిట్ చేయడం కోసం ఉత్తేజ్ ముందు తనకు పరిచయం అయ్యారని ఆ తర్వాత ఆ స్కిట్ వజ్రోత్సవాల్లో చేయకపోయినా సరే కొన్నాళ్ళకు చందమామ సినిమా అవకాశంతో ఉత్తేజ్ తలుపు తట్టారు అని చెప్పుకొచ్చారు. కృష్ణవంశీతో సినిమా అంటే కష్టమని అందరూ చెబుతున్నా ఉత్తేజ్ మీద నమ్మకంతో ఆ సినిమకి రాయడానికి సిద్ధమయ్యాను అని అన్నారు.

    కొండలరావు పాత్ర అంత అనుకోలేదు

    కొండలరావు పాత్ర అంత అనుకోలేదు

    సినిమాలో ఉత్తేజ్ పద్యాలు పాడే 'కొండలరావు' పాత్ర నిడివి మొదట్లో ఎక్కువ అనుకోలేదని ఇంట్లో ఉండే ఇంకో పాత్ర కోసం కమెడియన్ చంటిని అనుకుంటే ఆయనకు కుదరలేదని అందుకే ఆ పాత్ర చేసే పనులు కూడా ఉత్తేజ్ పాత్రతో చేయించాలని డిసైడ్ అయ్యామని అన్నారు. నేను రాసిన ప్రతి మాటకు ఉత్తేజ్ ప్రాణం పెట్టాడన్న ఆయన ఇప్పటికీ ఆ కోయదొర సీన్ ఎవరూ మర్చిపోలేరు.. నిజానికి ఆ సీన్ కోసం పెద్ద రీసెర్చ్ చేశానని అన్నారు.

    Recommended Video

    Jr NTR వదులుకున్న Blockbusters | Happy Birthday NTR || Filmibeat Telugu

    నిజమైన కోయవాళ్ళని సెట్ కి పిలిపించి

    అన్ని సినిమాల్లో ఉన్నట్టు 'కుర్రో కుర్రు' అనేది రాస్తే, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీకి నచ్చదు కాబట్టి, దానికోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇద్దరు నిజమైన కోయవాళ్ళని సెట్ కి పిలిపించి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ దేవతల పేర్లు, ఊతపదాలు తెలుసుకుని రాశానని, ఆ రాతలకు ఉత్తేజ్ విశ్వరూపం చూపించాడని అన్నారు. అలా ఆ ఏడాది ఉత్తమ హాస్యనటుడు గా నంది అవార్డు సొంతం చేసుకున్నాడని ఆయన వెల్లడించారు. ఇప్పటికీ ఆ అవార్డు నీవల్లే వచ్చింది అని ఉత్తేజ్ అంటారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఆయన పుట్టిన రోజు సంధర్భంగా ఒక స్కెచ్ కూడా వేసి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

    English summary
    Telugu writer Lakshmi bhupal revealed some interesting facts about chandamama movie directed by Krishna Vamsi. On the occasion of artist uttej birthday Lakshmi Bhopal sketched uttej's potrait and sharedit through his social media handle.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X