For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దాని కంటే అంగ మార్పిడి మంచిది.. చెప్పుల్తో కొట్టించి టీవీ లైవ్ ఇప్పిస్తా.. టాలీవుడ్ రచయిత స్ట్రాంగ్ వార్నింగ్

  |

  చందమామ సినిమాతో డైలాగ్ రైటర్ గా కెరీర్ ప్రారంభించిన లక్ష్మీ భూపాల్ మంచి సెన్సిబుల్ రచయితగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో నేనే రాజు నేనే మంత్రి, అలా మొదలైంది, ఓ బేబీ, లాంటి సినిమాలకు పని చేసిన ఆయన ప్రస్తుతం లూసిఫర్ రీమేక్, అన్నీ మంచి శకునములే, సినిమాలకు రైటర్ గా పని చేస్తున్నారు. తాజాగా ఆయన కొందరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

  విచ్చలవిడిగా వాడేస్తున్నట్టు

  విచ్చలవిడిగా వాడేస్తున్నట్టు

  కొందరు తనపేరు వాడుకుని ఇండస్ట్రీలో రచయితలుగా చెలామణీ అవ్వాలని చూస్తున్నారని అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం యధాతదంగా ''#బ్రేకింగ్ న్యూస్ : #నాకెక్కడా బ్రాంచీల్లేవ్.. దర్శక నిర్మాత లారా.. నిర్మకదర్శాతల్లారా.. నా దగ్గర అసిస్టెంట్ రచయితగా పనిచేశానని, నాకే తెలియకుండా నా దగ్గర ఘోస్ట్ దెయ్యం రైటర్ గా పనిచేశానని ఈ మధ్య కొందరు మార్కెట్లో ఏ మాత్రం సిగ్గులేకుండా నా పేరు విచ్చలవిడిగా వాడేస్తున్నట్టు తెలిసింది'' అని ఆయన పేర్కొన్నారు.

  అడ్వాన్స్ లు కూడా

  అడ్వాన్స్ లు కూడా

  ''ఇది మొదటిసారి కాదు.. వారిని నిలువునా తోలుతీసి ఉప్పూకారం రాసే మంచితనం నా దగ్గరున్నా నన్నెవరూ నిజానిజాలు అడగలేదు కాబట్టి నేను కూడా చెప్పలేదు, ఇప్పుడు ఏకంగా నా అసిస్టెంట్ అని చెప్పుకుంటూ కొందరు కొన్నిచోట్ల అడ్వాన్స్ లు కూడా తీసుకున్నారని తెలిసింది..అని ఆయన పేర్కొన్నారు.

  చాలా పెద్ద తిట్టు నాకు

  చాలా పెద్ద తిట్టు నాకు

  వాడెలా రాస్తాడో చూడాలి కానీ, అలా చెప్తే ఎలా డబ్బులిచ్చారని నేను అడిగితే "మీ దగ్గర పనిచేశాడు అన్న నమ్మకం" అన్నారు, ఇది చాలా పెద్ద తిట్టు నాకు.. కాబట్టి ఇప్పుడు తప్పడం లేదు'' అని పోస్ట్ చేశారు. ''నేను సినిమాల్లో మాటలు, పాటలు రాయడానికి ఇప్పటివరకు కేవలం నా బుర్రని తప్ప ఇంకెవరి సహాయం తీసుకోలేదు, ఒక్క అసిస్టెంట్ కూడా లేడు,'' అని ఆయమా అన్నారు.

  నేను మాట్లాడలేను

  నేను మాట్లాడలేను

  ఇకముందు కూడా ఆ అవసరం లేదు, ఎందుకంటే నిర్మాత, దర్శకుడు నన్ను, నా బుర్ర ని నమ్మి డబ్బులిస్తారని నేను నమ్ముతాను కాబట్టి.. అసిస్టెంట్లను పెట్టుకునే ఇతర రచయితల ఇబ్బందులు నాకు తెలీదు కాబట్టి వారి విషయంలో నేను మాట్లాడలేను'' అని అన్నారు.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu

  నాకెక్కడా బ్రాంచీల్లేవ్

  ''ఇక నా పేరు వాడుకుంటున్న దరిద్రులకు ప్రేమగా ఒక అభ్యర్థన.. "అమ్మలారా.. అయ్యలారా.. ఇక ముందు మీరు ఇలాంటి మోసాలు, కక్కుర్తి ఎదవా పనుల కోసం నా పేరు వాడినట్టు నాకు తెలిస్తే మాత్రం...... మీ తల్లిదండ్రులు, మీ భార్య బిడ్డల, మీ స్నేహితుల చెప్పులతో కొట్టించి టీవీ లైవ్ పెట్టించి మరీ సన్మానించబడును.. నీ స్వార్థం కోసం పక్కోడి పేరును వాడుకోవడం కంటే అంగ మార్పిడి చేయించుకోవడం మంచిది.." దయచేసి ఇలాంటి వాళ్ళని నమ్మకండి.. ఎందుకంటే.... నా కేరాఫ్ నేను మాత్రమే.. నాకెక్కడా బ్రాంచీల్లేవ్'' అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

  English summary
  Telugu writer Lakshmi bhupal gave strong warning to fraudster writers in tollywood. who are trying to use his name.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X