Paruchuri Gopala Krishna: "ఆ స్టార్ హీరోలు ఇద్దరూ నా కొడుకులే.. టాలీవుడ్ స్థాయిని వీళ్లే పెంచబోతున్నారు"

రైటర్ పరుచూరి గోపాల కృష్ణ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనేక కథలు రాసి.. అద్భుతమైన సినిమాలను అందించిన ఈయన ఈ మధ్య కథలు రాయట్లేదు. కానీ యూట్యూబ్ వేదికగా.. వస్తున్న అన్ని సినిమాలపై స్పందిస్తూ.. అందులోని ప్లస్ లు, మైనస్ ల గురించి చెబుతున్నారు. ముఖ్యంగా ముక్కుసూటిగా బాగుంటే బాగుందని, లేదంటే లేదని చెప్పేస్తూ.. తన మనసులోని భావాలను వివరిస్తున్నారు. అయితే తాజాగా తెలుగు సినీ రంగం స్థాయిని పెంచబోయేది తన కొడుకులే అని చెప్పుకొచ్చారు. వాళ్లిద్దరూ స్టార్ హీరోలు అని కూడా వివరించారు. మరి వారిద్దరూ ఎవరో, ఆ కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పరుచూరి గోపాల కృష్ణ తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ పరుచూరి పాఠాలులో ఓ వీడియోను విడుదల చేశారు. అందులో రాబోయే రెండు పెద్ద సినిమాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా పాన్ ఇండియా ప్రభాస్ హీరోగా చేసిన కల్కి 2898 ఏడీతో పాటు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన దేవర గురించి మాట్లాడారు. ఈ రెండు సినిమాల గురించి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు అంతా ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమాల్లోని అనేక విషయాల గురంచి చెప్పుకొచ్చారు.

Writer Paruchuri Gopala Krishna Shocking Comments About Kalki 2898 AD And Devara Movie Check Details

స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న సినిమానే కల్కి 2898 ఏడీ. అయితే ఈ సినిమా వస్తుందని చెప్పినప్పటి నుంచి అంతా తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీని నుంచి ఎలాంటి చిన్న అప్ డేట్ వచ్చినా తెలుసుకుంటూ రచ్చ చేస్తున్నారు. కల్కి 2898 ఏడీ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించబోతుంది. అలాగే బిగ్ బీ అమితా బచ్చన్, లోకనాయకుడు కనమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, సస్వత ఛటర్జీ, పశుపతి, గౌరవ్ చోప్రా, మండవ సాయి కుమార్ వంటి వాళ్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో రాబోతున్నారు. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై కోసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. అలాగే అనిరుథ్ సంగీతం అందిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా కనిపించబోతున్నారు. అలాగే షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, నరేన్, ప్రకాశ్ రాజ్, చైత్ర రాయ్, అభిమన్యు సింగ్, కళైరసన్ లు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.

Writer Paruchuri Gopala Krishna Shocking Comments About Kalki 2898 AD And Devara Movie Check Details

ఈ రెండు చిత్రాలపై ఇప్పటికే పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలు ఎప్పుడు వస్తాయనేది కరెక్టుగా తెలియకపోయినా.. కచ్చితంగా ఈ సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తాయని రచయిత పరుచూరి గోపాల కృష్ణ తెలిపారు. అలాగే ఈ రెండు సినిమాల చిత్ర బృందాలకు ముందుగానే కంగ్రాట్స్ చెప్పారు. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లు మాత్రమే.. తనను పెద్దనాన్న అని పిలుస్తారని.. ప్రస్తుతం తాను వారి సినిమాలకు కథలు రాయకపోయినా.. ఆ బంధం అలాగే కొనసాగుతుందని చెప్పారు.

ముఖ్యంగా వీరిద్దరూ తొలి చిత్రాల నుంచి ఇప్పటి వరకు ఒదిగే ఉన్నారని.. ఏరోజూ వీరిద్దరూ ఎదుటి వాళ్లతో చెడుగా ప్రవర్తించడం చూడలేదని అన్నారు. ఈ రెండు చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయితే అనేక మందికి మంచి జరుగుతుందని.. అలాగే కల్కితో పాటు దేవరలు తెలుగు సినీ ఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకు తీసుకు వెళ్తాయని చెప్పుకొచ్చారు. రెండు చిత్రబృందాలతో పాటు హీరోలకు శుభాకాంక్షలు చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X