అలా మానభంగం చేశారు.. వరలక్ష్మీ శరత్‌కుమార్‌పై భగ్గుమన్న సాయిమాధవ్ బుర్రా

టాలెంటెడ్ యాక్టర్ వరలక్ష్మి శరత్‌కుమార్ దర్శకురాలిగా మారి నటించిన చిత్రం సరస్వతి. దోశా డైరీస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై ఈ సినిమాను పూజా శరత్ కుమార్, వరలక్ష్మీ శరత్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి ఆంటోని ప్రవీణ్ డేనియల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ చిత్రంలో ప్రియమణి, రాధిక శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, కిషోర్, నాజర్, తులసి, సప్తగిరి, శ్రీకాంత్ అయ్యంగార్, మైమ్ గోపి, హరీష్ పెరాడీ, రఘుబాబు, గెటప్ శ్రీను, నివేష్క తదితరులు నటించారు.

ఈ సినిమా సాంకేతిక నిపుణుల వివరాల్లోకి వెళితే.. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, ఏఎం ఎడ్విన్ సాకే సినిమాటోగ్రాఫర్‌గా, వెంకట్ రాజన్ ఎడిటర్‌గా, శ్రీధర్ మాచర్ల ఆర్ట్ డైరెక్టర్‌గా, బృందా మాస్టర్ కొరియోగ్రఫి, నందూ మాస్టర్ స్టంట్స్ బాధ్యతల్ని నిర్వర్తించారు. ఈ సినిమా మార్చి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత రచయిత బుర్రా సాయి మాధవ్, దర్శకురాలు వరలక్ష్మీ శరత్ కుమార్ మధ్య వివాదం తెరపైకి వచ్చింది. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Sai Madhav Burra Vs Varalaxmi Sarathkumar

వరలక్ష్మీ శరత్ కుమార్ దర్శకురాలిగా, నిర్మాతగా మారి నిర్మించిన సరస్వతి చిత్రం బాలికపై లైంగిక దాడి నేపథ్యంగా ఓ మెడికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై క్రిటిక్స్, సాధారణ ప్రేక్షకులు మిక్స్‌డ్‌గా స్పందించారు. ఈ సినిమా ఓ రకమైన పాజిటివ్ టాక్‌తో థియేట్రికల్ జర్నీ మొదలుపెట్టింది.

అయితే ఈ సినిమాను వీక్షించిన కథకుడు సాయిమాధవ్ బుర్రా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తన కథను అడ్డదిడ్డంగా మార్చి వేయడంపై సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించాడు. ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్టుతో వివాదానికి తెర లేపారు. నా కథతో మొదలై వేరే కథతో పూర్తవుతుంది. నాతో ఒక్కమాటైనా చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు కథను మార్చేసుకొన్నారు. నేను రాసిన కథను మానభంగం చేశారు. నేను రాసిన కథ రివెంజ్ డ్రామా కాదు. నేను రాసిన కథలో ఆత్మ వేరు. అసలా కథ వేరు అనే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు ట్వీట్ చేశాడు. దాంతో ఈ సినిమా కథ విషయంలో దర్శకురాలికి, కథా రచయితకు అభిప్రాయబేధాలు ఉన్నట్టు స్పష్టమయ్యాయి.

రచయిత సాయి మాధవ్ బుర్రా వేసిన ట్వీట్‌పై వరలక్షీ శరత్ కుమార్ స్పందించాల్సి ఉంది. ఈ వివాదంపై ఆమె ఏ విధంగా స్పందిస్తారని ఎదురు చూస్తున్నారు. గతంలో వరలక్ష్మీకి మంచి పేరు తెచ్చిన క్రాక్, వీర సింహా రెడ్డి చిత్రాలకు కథ, మాటలు ఆయన అందించారు. ఆ సమయంలోనే ఈ సినిమా కథను వరలక్ష్మికి షేర్ చేసుకోవడం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X