Sri Ramana: తెలుగు పరిశ్రమలో విషాదం.. సినీ రచయిత, జర్నలిస్ట్ కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే మన ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది నటులు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్లు పలు కారణాలతో మృతి చెందారు. ఇలా వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇండస్ట్రీలో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్టు శ్రీ రమణ (70) తాజాగా కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

ప్రముఖ కథా రచయిత, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ కాలమిస్ట్ శ్రీ రమణ కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఇలా చాలా రోజులుగా మంచానికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలోనే గత రాత్రి ఆయన పరిస్థితి విషమించింది. దీంతో బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఆయన తుది శ్వాసను విడిచారు. ఈయన మరణంపై సినీ ప్రముఖులు, పాత్రకేయులు అంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

Writer Sri Ramana Passes Away Due to Health Issues

దాదాపు పాతికేళ్ల క్రితమే శ్రీ రమణ 'మిథునం' అనే 25 పేజీల పుస్తకాన్ని రాశారు. దీని ఆధారంగానే ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి 'మిథునం' సినిమాను తెరకెక్కించారు. బాలసుబ్రమణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అదే సమయంలో 2012 సంవత్సరానికి గానూ జాతీయ అవార్డుల జాబితాలో నామినేట్ కూడా అయింది. దీంతో శ్రీ రమణ పేరు కూడా అప్పట్లో దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది. ఇక, ఆయన బాపు - రమణతో కలిసి ఎన్నో చిత్రాలకు పని చేశారు.

ఇదిలా ఉండగా.. శ్రీ రమణ గుంటూరు జిల్లాలోని వేమూరు మండలం వరహాపురం అగ్రహారంలో 1952 సెప్టెంబర్ 21న జన్మించారు. ఈయన అసలు పేరు కామరాజ రామారావు. రచన మీద ఉన్న ఆసక్తితో పలు పత్రికల్లో సంపాదకుడిగా, కాలమిస్ట్‌గా పని చేశారు. ముఖ్యంగా 'నవ్య' పత్రిక ఎడిటర్‌గా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో హాస్య, వ్యంగ్య, ఉన్నతమైన కథలను రాశారు. అలాగే, చాలా చిత్రాల కోసం కూడా పని చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X