రూమర్లు నమ్మకండి.. నా ఆరోగ్యం బాగానే ఉంది: సుద్దాల అశోక్ తేజ

సినీ రచయిత, అభ్యుదయవాది సుద్దాల అశోక్ తేజకు ఇటీవల కాలేయ మార్పిడి సర్జరీ జరిగింది. ఆ తర్వాత ఆయన నెమ్మదిగా కోలుకొంటున్నారు. ఈ క్రమంలో సుద్దాల అశోక్ తేజ ఆరోగ్యం విషమించిందనే వార్తలు ఊపందుకొన్నాయి. ఈ క్రమంలోతన ఆరోగ్యంపై వస్తున్న రూమర్లను ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఖండించారు. కాలేయ మార్పిడి తర్వాత తాను కోలుకొంటున్నానని ఆయన వెల్లడించారు. తాజాగా ఓ వీడియోను విడుదల చేసి అశోక్ తేజ తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. తాజాగా వీడియోలో మాట్లాడుతూ..

నా ఆరోగ్యం గురించి తెలుసుకొంటూ నా శ్రేయస్సును కోరుతున్న స్నేహితులు, సన్నిహితులు, పాటను ప్రేమించే ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. ప్రేమ వల్ల, దయ వల్ల, ప్రభుత్వ సహాయ సహాకారాల వల్ల ఇటీవల కాలేయ మార్పిడి జరిగింది. ఆ తర్వాత ఆరోగ్యం కుదట పడింది. ఆరోగ్యం సంరక్షణలోనే ఉంటూ తాను పాటలు రాస్తున్నాను. అయితే మీడియాలో నా ఆరోగ్యం గురించి వస్తున్న రూమర్లు నాకు బాధను కలిగించాయి. అందుకే నా ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చేందుకు వీడియోను రిలీజ్ చేశాను.

Writer Suddala Ashok Teja given clarity on his health and rumours

ఆరోగ్యం ఇంకా మెరుగు పడాల్సి ఉంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అందరి మాదిరిగానే నేను జాగ్రత్తగా ఉంటున్నాను. పరిస్థితులను దృష్టిలోపెట్టుకొని ఆరోగ్యాన్ని కాపాడుకొంటున్నాను. అశోక్ తేజ ఆరోగ్యం విషమంగా ఉందని వచ్చిన వార్తలన్నీ అబద్దమే. నా గురించి బాధపడుతున్న ప్రతీ ఒక్కరికి నా బంధువులకు విషయం తెలియచేయాలనుకొన్నాను. అందరూ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకొంటున్నాను అని సుద్దాల అశోక్ తేజ అన్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X