రాంగ్ గోపాల్ వర్మ ఆడియో రిలీజ్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు టైటిల్ సాంగ్ అంకితం!

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ జర్నలిస్టు దర్శకుడిగా మారి రూపొందిస్తున్న చిత్రం రాంగ్ గోపాల్ వర్మ. స్టార్ కమెడియన్ షకలక శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో‌ను, సామాజిక కార్యకర్త దేవి, పోస్టర్‌ను మహిళాభ్యుదయవాది సంధ్య కొద్ది రోజుల క్రితం విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

సెప్టెంబర్ 2వ తేదీ పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ చిత్రం ఆడియోను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మరో ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ సంయుక్తంగా ఆవిష్కరించారు. ప్రముఖ మ్యూజిక్ కంపెనీ మధుర ఆడియో ద్వారా సంగీత ప్రియులకు ఈ పాటను అందుబాటులోకి తెచ్చారు. యువ సంగీత సంచలనం 'ర్యాప్ షకీల్' ఈ చిత్రానికి సంగీత సారధ్యం వహించారు. ర్యాప్ షకీల్ స్వయంగా పాడిన ఈ పాటకు దర్శక, నిర్మాత జర్నలిస్ట్ ప్రభు సాహిత్యాన్ని అందించారు. వర్మ వర్మ వర్మ అంటూ సాగే ఈ పాటను మెగాభిమానులకు, విశేషించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ప్రభు అంకితమిచ్చారు. ఆడియో ఆవిష్కరణలో తమ్మారెడ్డి భరధ్వాజ, కేఎల్ దామోదర్ ప్రసాద్, జర్నలిస్ట్ ప్రభు, సంగీత దర్శకులు ర్యాప్ షకీల్ పాల్గొన్నారు.

 Wrong Gopal Varma Audio released by Tammareddy Bharadwaja

రాంగ్ గోపాల్ వర్మ ఆడియో ఆవిష్కరణ సందర్భంగా తమ్మారెడ్డి-దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. సినిమా పాత్రికేయుడిగా సుదీర్ఘమైన అనుభవం కలిగిన ప్రభు అందరికీ తలలో నాలుకలా ఉన్నారు. ఎంతో ఆవేదనతో, ధర్మాగ్రహంతో.. ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఆశించి ప్రభు తెరకెక్కించిన ఈ చిత్రం అందరికీ చేరువ కావాలని కోరుకుంటున్నాం అని అన్నారు. సంగీత దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన ప్రభుకి మ్యూజిక్ డైరెక్టర్ ర్యాప్ షకీల్ కృతజ్ఞతలు తెలిపారు.

రాంగ్ గోపాల్ వర్మ చిత్రం కోసం తాను రాసిన 'వర్మా వర్మా వర్మా... ఓ రాంగ్ గోపాల్ వర్మ... ఇలా కాలింది ఏమిటయ్యా నీ ఖర్మ' అనే పాట మధుర ఆడియో ద్వారా, నాకు అత్యంత ఆత్మీయులైన తమ్మారెడ్డి భరద్వాజ, కెఎల్ దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా విడుదల కావడం సంతోషంగా ఉంది. ర్యాప్ షకీల్ మంచి ట్యూన్ ఇవ్వడంతోపాటు తనదైన గానంతో పాటను రక్తి కట్టించారు. ఈ పాటను మెగాభిమానులకు, ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అంకితం చేస్తున్నాను. అందుకే పవన్ పుట్టినరోజున ఈ పాటను విడుదల చేస్తున్నాం అని రచయిత, దర్శక, నిర్మాత ప్రభు అన్నారు.

పవన్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా బ్యానర్లు, ఫెక్లీలు కడుతూ విద్యుత్ షాక్‌కు గురై మరణించిన ముగ్గురు పవన్ ఫ్యాన్స్‌కు ప్రభు సంతాపం తెలిపారు. ఈ చిత్రం ద్వారా వచ్చే ఆదాయంలో పావు వంతు... ఆ ముగ్గురు ఫ్యాన్స్ కుటుంబాలకు అందిస్తామని ప్రకటించారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X