సి కళ్యాణ్ చేతుల మీదుగా www.మీనా బజార్ ఫస్ట్ లుక్

డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. మీనబజార్ టీజర్, ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమం మంగళవారం జరిగింది. హీరో మధు సుధన్, హీరోయిన్ శ్రీజిత ఘోష్, నిర్మాతలు సి.కళ్యాణ్, రామసత్యనారాయణ ముఖ్య అథితులుగా పాల్గొన్నారు. మీడియా మిత్రులు స్టిల్ ఫోటోగ్రఫర్స్ ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. మీనా బజార్., చిత్ర ప్రమోషన్స్ ను వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర సభ్యులు.

ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతు..
మీనా బజార్., టీజర్ బాగుంది. ఈ చిత్రం మంచి సక్సెస్ అయ్యి పార్ట్ 2 కూడా రావాలని కోరుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీలో జరిగే కొన్ని సంఘటనలు ఆధారంగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. మంచి చిత్రాలు ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ మీనా బజార్ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్న అన్నారు.

www.Meenabazar movie released by C Kalyan

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ..
ఈ చిత్ర టీజర్ చూస్తుంటే అర్థం అవుతుంది వీరు ఎంత గ్రాండ్ గా సినిమా తీశారో. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. తప్పకుండా ఇలాంటి సినిమాలు విజయం సాధిస్తాయి. కంటెంట్ బాగున్న చిన్న సినిమాలు సక్సెస్ అవ్వడం సహజమే. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్న అన్నారు.

డైరెక్టర్ రానా సునీల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ..
నేను కన్నడలో ఒక సినిమా చేశాను. తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇది. మంచి కథతో ఈ సినిమాను తీసాను. హీరో హీరోయిన్ బాగా చేశారు. మాకు నిర్మత సి.కళ్యాణ్ గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు వారికి ధన్యవాదాలు. టీజర్ బాగుందని అందరూ అంటున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియజేస్తాము అన్నారు.

హీరో మధుసూదన్ మాట్లాడుతూ...
మన చుట్టూ జరిగే సంఘటనలు ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ సబ్జెక్ట్ కు కనెక్ట్ అవుతారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సునీల్ కుమార్ సింగ్ గారికి ధన్యవాదాలు అన్నారు.

హీరోయిన్ శ్రీజిత ఘోష్ మాట్లాడుతూ...
నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాలో నా పాత్ర మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ కావాలి. మంచి సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

నటీనటులు: వైభవీ జోషి, శ్రీజిత ఘోష్, మధుసూధన్, రాజేష్ నటరంగ, రానా సునీల్ కుమార్ సింగ్, మధు సుధన్, శ్రీజిత ఘోష్, అరవింద్ రావ్ తదితరులు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X