సెన్సార్ పూర్తి చేసుకున యాత్ర.. క్లీన్ 'యు' సర్టిఫికెట్!
టాలీవుడ్ లో బయోపిక్ చిత్రాల పరంపర కొనసాగుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర. ఈ బయోపిక్ చిత్రంలో వైఎస్ఆర్ పాత్రలో మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి గెటప్‌లో మమ్ముట్టి ఒదిగిపోయి నటిస్తున్నాడు. మమ్ముట్టి వేషధారణ మొత్తం రాజశేఖర్ రెడ్డిని తలపించే విధంగా ఉంది.
యాత్ర చిత్రం ఎక్కువగా వైఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్రంలో చేసిన పాదయాత్ర, ముఖ్యమంత్రిగా ఎదిగిన వైనంపైనే ఫోకస్ అయి ఉంటుంది. మహి వి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకుడు. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి ప్రజలతో మమేకం అయ్యే సన్నివేశాలని దర్శకుడు ఎమోషనల్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన వచ్చింది.
యాత్ర చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ 'యు' సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వైఎస్ జగన్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతులన్నట్లు వార్తలు వస్తున్నాయి. జగపతి బాబు, అనసూయ, సుహాసిని ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. శశి దేవి రెడ్డి, విజయ్ చిల్ల ఈ చిత్రానికి నిర్మాతలు.



Click it and Unblock the Notifications











