సస్పెన్స్ వీడింది: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’... లక్ష్మి పార్వతి పాత్రలో ఈవిడే, చంద్రబాబు పాత్రలో ఎవరంటే?
'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు సంబంధించిన అంశాలతో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సంచలనం క్రియేట్ చేస్తున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ... ఇటీవల విడుదల చేసిన 'వెన్నుపోటు', 'ఎందుకు?' పాటల ద్వారా సినిమా ప్రమోషన్స్ తారా స్థాయికి తీసుకెళ్లారు.
ఎన్టీఆర్ జీవితంలోకి రెండవ భార్యగా లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత జరిగిన పరిణామాలు, ఆయన్ను వెన్నుపోటు పొడిచింది ఎవరు? అనే అంశాలు ఈ చిత్రంలో చూపింబోతున్నట్లు చెబుతూ వస్తున్న ఆర్జీవీ ఇందులో లక్ష్మీ పార్వతి పాత్ర పోషిస్తున్నది ఎవరు? అనే విషయం మాత్రం ఇప్పటి వరకు సస్పెన్స్‌గానే ఉంచుతూ వచ్చారు. తాజాగా ఆ సస్పెన్స్ వీడింది.

లక్ష్మీ పార్వతి పాత్రలో నటించేది ఈవిడే..
లక్ష్మీ పార్వతి పాత్రలో నటిచేది ఎవరు? అనే విషయం వెల్లడిస్తూ రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పాపులర్ కన్నడ నటి యగ్న శెట్టి ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రలో కనిపించబోతున్నారు.

గతంలో వీరప్పన్ భార్య పాత్రలో
యగ్న శెట్టి గతంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘వీరప్పన్' మూవీలో గంధపుచెక్కల స్మగ్లర్ భార్య పాత్రలో నటించారు. ఆవిడనే ఇపుడు తన తాజా చిత్రంలో ఎన్టీఆర్ భార్య లక్ష్మిపార్వతిగా చూపించబోతున్నారు.

చంద్రబాబు పాత్రలో...
అంతే కాదు... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీలో చంద్రబాబు పాత్రలో కనిపించేది ఎవరు? అనే విషయం కూడా వర్మ వెల్లడించారు. అతడికి సంబంధించిన ఫోటో షేర్ చేశారు. ఆ నటుడి పోలికలు అచ్చం చంద్రబాబు మాదిరిగానే ఉండటం గమనార్హం.

ఎన్టీఆర్ పాత్ర సీక్రెట్
అయితే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీలో ఎన్టీఆర్ పాత్రలో ఎవరు కనిపించబోతున్నారు? అనేది మాత్రం వర్మ సీక్రెట్ గానే ఉంచారు. మరికొన్ని రోజుల పాటు సస్పెన్స్ మెయింటేన్ చేసిన తర్వాత ఆ విషయాలు బయటపెట్టే అవకాశం ఉంది.

రిలీజ్ డేట్ ఎప్పుడు?
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు? అనేది కూడా ఇంకా డిసైడ్ చేయలేదు. తగిన సమయం చూసి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రామ్ గోపాల్ వర్మ ప్లాన్ చేస్తున్నారు. ఈ లోగా సినిమాకు హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











