For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యండమూరి దర్శకత్వంలో ‘దుప్పట్లో మిన్నాగు’

  |

  యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతొన్న చిత్రం "దుప్పట్లో మిన్నాగు". చిరంజీవి క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి అమర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‌ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో ప్రఖ్యాత కన్నడ కధానాయిక చిరాశ్రీ నటిస్తొంది.

  నవ్య వారపత్రికలో నవలల పోటీలో 50,000 ప్రథమ‌బహుమతి పొందిన 'దిండు కింద నల్ల త్రాచు' నవల ఆధారంగా రూపొందుతొన్న చిత్రమిది.‌ ఈ చిత్ర టీజర్‌ ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు.

  ఓ అర్దరాత్రి నీ జెండర్ మారిపొతే ఏం చేస్తారు అనే ప్రశ్న‌కు...

  ఓ అర్దరాత్రి నీ జెండర్ మారిపొతే ఏం చేస్తారు అనే ప్రశ్న‌కు...

  యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ..‌12 సం. క్రితం వచ్చిన ఓ చిన్న ఐడియా తో ఈ కథ రాయటం జరిగింది. ఓ ఇంటర్యూ లో... ఓ అర్దరాత్రి నీ జెండర్ మారిపొతే ఏం చేస్తారు అనే ప్రశ్న‌కు ఓ అమ్మాయి చెప్పిన సమాధానం, అందులో ఉన్న డెప్త్‌ను అర్దంగా చేసుకుని ఈ కథను రాయటం జరిగింది. కాశ్మీర్ ఉగ్రవాదం నేపథ్యంలో అకస్మాత్తుగా తప్పిపోయిన తండ్రిని, ఓ కూతురు ఎలా వెతికి పట్టుకుంది. తీవ్రవాదులని ఎలా మట్టు పెట్టిందన్న కథాశంతో రూపొందించిన చిత్రమని తెలిపారు.

  యండమూరి స్పూర్తితో..

  యండమూరి స్పూర్తితో..

  నిర్మాత చల్లపల్లి అమర్ మాట్లాడుతూ.. 1992 నుంచి ప్రొడక్షన్‌లో ఉన్నాను. యాడ్ ఫిలింస్, డాక్యుమెంటరీలు చేస్తుంటాను. ‌ఇది మా తొలి చిత్రం. ఈ సినిమా చాలా తక్కువ టైమ్‌లో తీశాం. అందరి సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నాను. యండమూరి గారు నాకు స్పూర్తి నిచ్చిన వ్యక్తి. ఈ రోజు ఆయనతో సినిమా చేయటం ఆనందంగా ఉందన్నారు.

  సిరివెన్నెల మాట్లాడుతూ...

  సిరివెన్నెల మాట్లాడుతూ...

  సిరి వెన్నెల సీతారామ శాస్తి మాట్లాడుతూ.. యండమూరి గారితో నాకు ఎప్పటినుంచో పరిచయం. తెలుగు తెలిసిన వారందరికి ఆయన తెలిసిన వ్యక్తి. సెలెబ్రటీలు కూడా ఆయనకు అభిమానులు. ఆయన ప్రత్యేకమైన, పాపులర్ రచయిత. అన్నీ తరహా పాఠకలకు ఆయన రచనా శైలీ నచ్చుతుంది. కథలొ ఆసక్తికరంగా ఓ పాయింట్‌తో, అవసరమైన ఏదో ఒక విషయం ఆయన ప్రస్తావిస్తూ ఉంటాడు. బేతాళ విక్రమార్కుడు‌లా అందరికీ అవసరమయ్యేలా ఆయన కథలు చెపుతూనే ఉన్నాడు. ఇప్పుడు సినిమా చేస్తున్నారు. ఇది అంతే అర్దంవంతంగా, కాంటెపరరీ ఇష్యూ టచ్ చెస్తూ ఈ చిత్రాన్ని తీశారనిపించింది. ఈ కథను నేను చదివాను. సినిమా సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను అన్నారు.

  దుప్పట్లో మిన్నాగు

  దుప్పట్లో మిన్నాగు

  చిరాశ్రీ ,విశ్వజిత్, నవీన్ తీర్దహళ్ళ, సుబ్బరాయ శర్మ,సుథీర్ కుమార్ ,మఢథా చిరంజీవి, అమర్ ప్రసాద్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి మాటలు: శ్రీశైల మూర్తి, కెమెరా: నిరంజన్ బాబు, ఎటిడింగ్: పవన్ ఆర్.ఎస్. , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: సతీష్ బాబు, సౌండ్ ఇంజనీర్ : శ్రీరామ్,
  పి.ఆర్.ఓ: సాయి సతీష్‌,
  బ్యానర్: చిరంజీవి క్రియేషన్స్,
  నిర్మాత : చల్లపల్లి‌అమర్,రచన- దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాథ్.

  English summary
  Yandamuri Veerendranath's Duppatlo Minnagu teaser launched. The movie based on Dindu kinda Nalla trachu book, which is published by swathi magazine.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X