యండమూరి చేతుల మీదుగా తొలి ఏకాదశి.. మంచి రెస్సాన్స్ అందుకొన్న ఫస్ట్‌లుక్
సినిమా రాతను మార్చే బలం టైటిల్‌లో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఎమోషనల్, ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్‌తో కూడిన టైటిల్స్ ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పిస్తాయి. అలాంటి ఫీల్‌ను కలిగించేలా ఉన్న టైటిల్‌తో ఓ చిత్రం రాబోతున్నది. కేవలం టైటిల్ మాత్రమే కాదు.. కంటెంట్ పరంగా కూడా విభిన్నంగా ఉంటుందనే ఫీలింగ్‌తో రాబోతున్న చిత్ర తొలి ఏకాదశి. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ విడుదల చేయడంతో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇక తొలి ఏకాదశి సినిమా వివరాల్లోకి వెళితే..

వంద చిత్రాల నిర్మాతగా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకోబోతున్న భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ సమర్పణలో తొలి ఏకాదశి. ఈ సినిమాను అండ్ సంధ్య స్టూడియస్, భీమవరం టాకీస్ పతాకాలపై రూపొందుతున్న చిత్రానికి సాయి సందీప్ మద్దూరు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
తొలి ఏకాదశి చిత్రాన్ని నూతన నిర్మాత ఎన్ ఫ్రేమ్స్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై గిరిధర్ శ్రీరామగిరి నిర్మిస్తున్నారు. ఇదొక హారర్ సస్పెన్స్ థ్రిల్లర్. అనుకోకుండా ఒక అమ్మాయి తనకి తెలీకుండానే ఒక సమస్యలో చిక్కుకుంటుంది. ఆ సమస్య నుంచి తను ఎలా బయటపడింది అనే కథే తొలి ఏకాదశి. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ప్రఖ్యాత రచయిత-దర్శకులు యండమూరి విడుదల చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
నటీనటులు: సుమిత్ రాయ్, సాయి రాజ్, సాయి నివాస్, మమతా నారాయణ్, వాణి, సాహితి దాసరి, లక్ష్మి కుమార్, శ్రీ నాగమణి, జబర్దస్త్ అప్పారావు, కొత్త వెంకటేశ్వరరావు, సూర్య కిరణ్ తదితరులు
నిర్మాత: గిరిధర్ శ్రీరామగిరి
రచన-దర్శకత్వం: సాయి సందీప్ మద్దూరు
పీఆర్వో: అప్పాజీ
పోరాటాలు: దేవి వరప్రసాద్
కూర్పు: బాలరాజు భూక్యా
ఛాయాగ్రహణం: సుధాకర్ అక్కినపల్లి
సంగీతం: సంధ్య వర్షిణి


Click it and Unblock the Notifications











