KGF 2 టీజర్.. అరగంటలోనే సరికొత్త రికార్డ్
KGF చాప్టర్ 1 విడుదలైనప్పుడు అసలు ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిని అందుకోగలదా అనే అనుమానాలు చాలనే వచ్చాయి. కానీ సినిమా విడుదల తరువాత కన్నడ ఇండస్ట్రీలో కూడా నేషనల్ లెవెల్లో బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేయగల హీరోలు ఉన్నారని నిరూపించాడు యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే.
ఇక యష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని అనుకున్న టీజర్ ఒకరోజు ముందే లీక్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. KGF చప్టార్ 2పై కూడా అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో లీకైన కొన్ని నిమిషాలకే క్లారిటీ వచ్చేసింది. ఇక అఫీషియల్ టీజర్ యూ ట్యూబ్ లో మరో సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. అరగంటలోనే ఒక కొత్త రికార్డును క్రియేట్ చేసింది.

అత్యదిక వేగంగా 2 మిలియన్ వ్యూవ్స్ అందుకున్న టీజర్ గా KGF 2 నిలిచింది. గత రాత్రి అనుకోకుండా టీజర్ లీకైన విషయం తెలిసిందే. ఇక వెంటనే చిత్ర యూనిట్ కొన్ని నిమిషాల్లోనే అఫీషియల్ గా విడుదల చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో KGF 2 టీజర్ ట్రెండ్ అవుతోంది. దేశవ్యాప్తంగా అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చాక ఏ రేంజ్ లో సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











