టాలీవుడ్‌లోకి మరో హీరో, దర్శకుడు ఎంట్రీ.. ఐశ్వర్యకు తోడుగా అభిరామ్ అంటూ...!!
టాలీవుడ్‌లోకి మరో ప్రతిభావంతుడైన యువ హీరో పరిచయం కాబోతున్నాడు. మహేశ్వర మూవీ మేకర్స్ పతాకంపై స్వర్గీయ ఎన్‌సీఎస్ రాయుడు దివ్యాశీస్సులతో శ్రీమతి సరస్వతి వెంకటేష్ ఎన్ నిర్మిస్తున్న ఐశ్వర్యకు తోడుగా అభిరామ్ అనే చిత్రం ద్వారా యష్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి మరో ప్రతిభాశాలి రామకృష్ణార్జున్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో నాంది ఫేమ్ నవమి గాయక్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణకు సిద్ధం అవుతున్నది.
ఈ సందర్భంగా నిర్మాతలు సరస్వతి వెంకటేష్ మాట్లాడుతూ.. యష్ రాజ్‌కు మంచి భవిష్యత్ ఉంది. అలాగే ఐశ్వర్యకు తోడుగా అభిరామ్ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకొనే విధంగా దర్వకుడు రామకృష్ణార్జున్ తెరకెక్కిస్తున్నారు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అని అన్నారు.

నటీనటులు: యష్ రాజ్, నవమి గాయక్, "బాహుబలి" ప్రభాకర్, శివబాలాజీ, తులసి, అన్నపూర్ణమ్మ, రఘుబాబు, వై.విజయ, నవీనారెడ్డి, కాదంబరి కిరణ్, సుమన్ శెట్టి, విజయ్ రంగరాజు, గౌతంరాజు, జబర్దస్త్ శేషు, జూనియర్ రేలంగి, అంబటి శ్రీను, కిషోర్ దాస్, శశాంక్ తదితరులు

కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రామకృష్ణార్జున్
నిర్మాత: సరస్వతి వెంకటేష్
సమర్పణ: ఎన్‌సిఎస్ రాయుడు
కో-డైరెక్టర్: మడుత శివకుమార్
ఫైట్స్: వించన్ అంజి
నృత్యాలు: చంద్ర కిరణ్
పాటలు: సాగర్ నారాయణ్
సంగీతం: మీనాక్షి భుజంగ్
ఛాయాగ్రహణం: కొమరి జగదీష్
కూర్పు: మార్తాండ్ కే వెంకటేష్
పిఆర్‌వో: ధీరజ్-అప్పాజీ
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఉల్లగంటి ప్రసాద్



Click it and Unblock the Notifications











