KGF Chapter 3 గురించి పెదవి విప్పిన యష్.. ఈసారి ప్లాన్ అదే అంటూ ఓపెన్ కామెంట్స్
కన్నడ స్టార్ హీరో యష్ నటించిన KGF Chapter 1 సినిమా ఎంత అద్భుతమైన విజయాన్ని అందుకుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో రెండో భాగం కూడా తెరకెక్కిస్తున్నామని దర్శక నిర్మాతలు ప్రకటించారు. వారు ప్రకటించిన విధంగానే రెండో భాగాన్ని కూడా ఇటీవల ఏప్రిల్ 14 తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాగా అది అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమా చివరిలో మరో భాగం ఉండే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. తాజాగా ఈ విషయం మీద హీరో యష్ స్పందించారు ఆ వివరాల్లోకి వెళితే..

కీలక పాత్రల్లో
కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరో గా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం KGF Chapter 2. KGF Chapter 1 2018 సంవత్సరంలో వచ్చిన సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు.. ఈ సినిమా విడుదలైన మొదటి ఆడ నుంచి అద్భుతమైన స్పందన తెచ్చుకోవడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. భారీ బడ్జెట్ సినిమాగా హోంబలే ఫిలిమ్స్ తెరకెక్కిన ఈ సినిమాలో రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్, కీలక పాత్రల్లో నటించారు.

మూడో భాగం
ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తూ మరింత ముందుకు వెళుతోంది. ఈ సినిమా చివరిలో యష్ చనిపోతున్నట్లు చూపిస్తూనే మరో భాగానికి ఆస్కారం ఉంది అంటూ దర్శకుడు ఒక హింట్ ఇచ్చాడు. అయితే ఈ విషయం మీద ఇప్పటి వరకు అధికారికంగా ఎవరూ స్పందించలేదు కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యష్ మాత్రం ఈ ఇంటర్వ్యూలో మూడో భాగం గురించి స్పందించినట్లు తెలుస్తోంది.

అద్భుతంగా కుదురుతుంది అని
ఆయన మాట్లాడుతూ నిజానికి నేను ప్రశాంత్ కలిసి చాలా సీన్స్ ప్లాన్ చేసాము కానీ వాటిని కూడా చాప్టర్-2 లో చూపించలేకపోయాము, అలాగే మూడవ భాగం లో చూపించడానికి ఎన్నో ఐడియాలు ఉన్నాయి అందుకే మూడో భాగం కచ్చితంగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికిప్పుడు సినిమాని తెరకెక్కించలేము కానీ తెరకెక్కించిన సమయంలో మాత్రం ఈ సినిమా అద్భుతంగా కుదురుతుంది అని చెప్పుకొచ్చారు.

గందరగోళంగా
నిజానికి ఈ సినిమాని మొదట ఒక భాగంగానే విడుదల చేయాలని అనుకున్నాము కానీ సినిమాకు ఉన్న విలువ అర్ధం అయిన తర్వాత ప్రశాంత్ నీల్ దానిని రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని యష్ వెల్లడించారు. నిజానికి మొదట ఒకే సినిమాగా విడుదల చేయాలి అనుకున్నాము కానీ అలా చేయాల్సి వస్తే సినిమా మొత్తం గజిబిజి గందరగోళంగా మారే అవకాశం ఉందని అనిపించింది.

టెన్షన్ పడ్డాను కానీ
కొన్ని ఎమోషన్స్ ని అలా త్వరత్వరగా చూపించడం కుదరదు అని భావించి ఇలా రెండు భాగాలుగా విడుదల చేయాలని భావించామని చెప్పుకొచ్చారు. నిజానికి సినిమాలో స్టఫ్ అంతా రెండో భాగం లోనే ఉంటుంది ఒకవేళ మొదటి భాగం విడుదల చేసి సరైన స్పందన రాకపోతే రెండో భాగం విడుదల అయ్యేది కాదు ఈ విషయంలో నేను ముందు చాలా టెన్షన్ పడ్డాను కానీ మొదటి భాగాన్ని కూడా ప్రేక్షకులు బాగా ఆదరించారు దీంతో రెండో భాగంతో మీ ముందుకు వచ్చామని ఆయన చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











