కేజీఎఫ్ చాప్టర్2 రిలీజ్ ఫిక్స్.. ప్రపంచవ్యాప్తంగా విడుదల ఎప్పుడంటే..
ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజీఎఫ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్లను సొంతం చేసుకొన్నది. సెన్సేషనల్ విజయం అందుకొన్న ఈ చిత్రానికి సీక్వెల్‌ను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్‌కు చెందిన సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. అలాగే తెలుగులో విలక్షణ నటుడు రావు రమేష్ కూడా ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.
హీరో యష్ రాకీ అలియాస్ రాజా కృష్ణప్ప బైర్యాగా, అధీరాగా సంజయ్ దత్, రమికా సేన్‌గా రవీనా టాండన్, రీనా దేశాయ్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సీనియర్ నటుడు అనంత్ నాగ్, మాళవిక అవినాష్, సరన్ శక్తి, విశిష్ట సిన్హా తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొన్నది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
అయితే ఈ సినిమా విడుదలపై చిత్రయూనిట్ కీలక ప్రకటన చేసింది. కేజీఎఫ్ చాప్టర్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 23న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.


Click it and Unblock the Notifications











