twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆగ‌స్ట్ 26 నుంచి కేజీఎఫ్‌2.. రెక్కీతో ప్రశాంత్‌ నీల్ డేరింగ్‌గా ముందుకు

    |

    గతేడాది సంచలన విజయం సాధించిన కేజీఎఫ్: చాప్టర్ 1 చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న కె.జి.య‌ఫ్‌ చాప్ట‌ర్ 2 షూటింగ్‌ను ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టు 26వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయం తీసుకొన్నట్టు చిత్ర యూనిట్ ఓ ప్రకటన విడుదల చేసింది.

    కైకాల స‌త్య‌నారాయ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ కిర‌గందూర్ నిర్మిస్తోన్న‌ భారీ బ‌డ్జెట్ చిత్రానికి సంబంధించిన షూటింగు లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే రిలీజ్ డేట్‌ను దృష్టిలో పెట్టుకొని, అలాగే సంజయ్ దత్‌తో చేయాల్సిన సన్నివేశాలను పూర్తి చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు సమాచారం.

    Yashs KGF Chapter 2 shoot resume from August 26th

    రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా రూపుదిద్దుకొంటున్న కె.జి.య‌ఫ్‌ చాప్ట‌ర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ సీక్వెల్‌ కూడా భారీ విజయాన్ని అందుకోవడం తథ్యం అనే మాట ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా మూవీగా క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేసేందుకు సిద్ధమవుతున్నారు. కేజీఎఫ్ 2 చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. సంజయ్ దత్, . ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

    తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఆగ‌స్ట్ 26 నుంచి కెజిఎఫ్‌2 షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. బెంగ‌ళూరులోని కంఠీర‌వ స్టూడియోలో కేజీఎఫ్‌2 షూటింగ్ ప్రారంభం కానున్నది. ఇప్పటికే ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌, ఇత‌ర కీల‌క‌మైన యూనిట్ స‌భ్యుల‌తో క‌లిసి, లొకేష‌న్ రెక్కీ నిర్వ‌హించారు. 26 నుంచి జ‌రిగే బ్యాలెన్స్ షూటింగ్‌లో ప్ర‌కాష్ రాజ్‌, మాళ‌విక అవినాష్ త‌దిత‌రులు పాల్గొంటున్నారు అని తెలిపారు.

    Yashs KGF Chapter 2 shoot resume from August 26th

    దాదాపు ప‌దిరోజులపాటు జ‌రిగే ఈ కీలక షెడ్యూల్‌తో కేవ‌లం క్లైమాక్స్ ఫైట్ మిన‌హా మొత్తం సినిమా షూటింగ్ పూర్త‌యిన‌ట్లే. తొలి భాగాన్ని మించి రెండో భాగం సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. ఇందులో అధీర పాత్ర‌లో సంజ‌య్ ద‌త్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

    English summary
    The second in the KGF franchise 'KGF 2' shoot is all set to start from the 26th of August. The movie team had issued a note regarding the re-scheduled shooting dates today.KGF - Chapter 2 is being produced by Vijay Kirangadoor under the direction of Prashanth Neel. Veteran artist Kaikala Satyanarayana is presenting the movie. KGF - Chapter 2 is said to be the biggest budget movie ever made in the Kannada film industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X