హీరో యష్ సరికొత్త లుక్.. పక్కా బిజినెస్ మెన్‌గా మారాడా?

కెజిఎఫ్ స్టార్ యష్ సరికొత్తగా దర్శనమిచ్చి షాకిచ్చారు. ప్రస్తుతం కెజిఎఫ్ సినిమాకు సీక్వల్ గా వస్తున్న కెజిఎఫ్2 చిత్రంలో నటిస్తున్న కన్నడ రాక్ స్టార్ యష్ కొత్తగా మేకోవర్ అయ్యారు. తాజాగా కెజిఎఫ్ 2 చిత్రంలో యశ్ కి సంబందించిన ఓ లుక్ బయటకువచ్చింది. ఇందులో ఎంతో అట్రాక్టివ్‌గా దర్శనమిచ్చాడు హీరో యష్.

గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన కెజిఎఫ్ మూవీ కన్నడ సినీ ఇండస్ట్రీని షేక్ చేసేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన ఈ సినిమా.. మునుపెన్నడూ ఏ కన్నడ సినిమా రాబట్టని కలెక్షన్స్ రాబట్టి రికార్డులను తిరగ రాసింది. అయితే కెజిఎఫ్ సీక్వెల్ ఉంటుందని ఆ సినిమా విడుదలకు ముందుగానే ప్రకటించిన దర్శకనిర్మాతలు ప్రస్తుతం ఆ పనిలో ఉన్నారు. కెజిఎఫ్ మూవీ సీక్వల్ గా కెజిఎఫ్2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కెజిఎఫ్ 2 విడుదలకు ఇంకా చాలా సమయమున్నా అభిమానులు మాత్రం ఇప్పటి నుంచే ఎదురుచూపులు మొదలుపెట్టారు. ఇప్పటికే మేజర్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యిందని ఇంకో ఆరేడు నెలల్లో మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసి విజువల్ ఎఫెక్ట్స్ గ్రాండ్ గా ఉండేలా చాలా సమయం తీసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరపనుంది చిత్రయూనిట్.

Yashs new lokk from KGF Chapter 2

ఎలాంటి అప్ డేట్స్ రాకున్నా కెజిఎఫ్ 2 సినిమాపై భారీ హైప్ నెలకొన్న ఈ తరుణంలో యశ్ లుక్ చూసి సర్ ప్రైజ్ అయ్యారంతా. ఈ లుక్ సూటు బూటు వేసుకుని జుట్టు, గెడ్డం మొత్తం స్టైలిష్ గా మార్చుకున్న రాఖీ భాయ్ గా యష్ కొంచెం కొత్తగా ఉన్నాడు. అంతేకాదు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో పెత్తనం మొత్తం తన చేతుల్లోకి తీసుకున్న రాఖీ భాయ్ పక్కా బిజినెస్ మెన్‌గా మారినట్టు కనిపిస్తున్నాడు యశ్. దీంతో ఈ లుక్ చూసి యష్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతూ ఫొటోను వైరల్ చేస్తున్నారు.

కోలార్ గనులను తన హస్తగతం చెసుకున్న రాఖీ భాయ్ కర్ణాటక నుంచే ఢిల్లీ రాజకీయాలను శాశించే స్థాయికి ఎలా చేరుకున్నాడు అనే పాయింట్ తో కేజిఎఫ్ 2 రూపుదిద్దుకుంటోంది. ఫస్ట్ పార్ట్ కంటే రెండింతలు ఎక్కువ యాక్షన్ మసాలా ఇందులో ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పడం, అందుకు తగట్టుగా ఇప్పుడు బయటకొచ్చిన వైస్ లుక్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి.

More from Filmibeat

Read more about: kgf chapter 2 yash prashanth neel
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X