Toxic: యువతితో యష్ రొమాన్స్‌‌పై వివాదం... రిలీజ్‌కు ముందే టాక్సిక్‌కు ఊహించని దెబ్బ

కేజీఎఫ్ ఫేమ్, కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తోన్న తాజా చిత్రం టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. నటి, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మోన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, యష్‌లు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో యష్ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వారు రుక్మిణీ వసంత్, కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా.

మార్చి 19న టాక్సిక్ రిలీజ్
అక్షయ్ ఒబెరాయ్. బియాట్రిజ్ తౌఫాన్‌బచ్‌, డెరిల్ డీ సిల్వ, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ, టోవినో థామస్, కైల్ పాల్‌లు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా... ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్, రాజీవ్ రవి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. సమ్మర్ కానుకగా ఈ ఏడాది మార్చి 19న టాక్సిక్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలోని ఒక్కొక్కరి పాత్రకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తూ వచ్చారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఇటీవల యష్ పుట్టినరోజును పురస్కరించుకుని టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు.

Yash s Toxic Movie Lands in Controversy Over Intimate Scenes Ahead of Release

టాక్సిక్‌లో ఇంటిమేట్ సీన్స్‌పై వివాదం
ఫుల్ యాక్షన్ మోడ్‌లో, వయలెన్స్, ఇంటిమేట్ సీన్స్‌తో ఉన్న ఈ గ్లింప్స్... యాక్షన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అదే సమయంలో ఈ సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుందో దర్శకురాలు హింట్ ఇచ్చారు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే వివాదంలో చిక్కుకోవడం చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రధానంగా ఈ గ్లింప్స్‌లోని ఓ చోట రౌడీలకు, హీరోకి మధ్య భీకర యుద్ధం జరుగుతుండగా.. తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్ల మధ్యలో స్మశానం వద్ద యష్ ఓ ఫారిన్ అమ్మాయితో కారులో రొమాన్స్ చేస్తున్న ఇంటిమేట్ సీన్స్ వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహిళా దర్శకురాలు అయ్యుండి ఇలాంటి సీన్స్ తీయడం ఏంటీ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

వివాదంపై గీతూ మోహన్‌దాస్ స్పందన
ఈ వివాదం నేపథ్యంలో ఇప్పటికీ గీతూ మోహన్‌దాస్ స్పందించి వివరణ ఇచ్చారు. మహిళల ఆనందం, వారి సమ్మతి, వ్యవస్థలతో స్త్రీలు ఆడుకోవడం లాంటివి జనానికి ఇంకా అర్ధం కావడం లేదు. నేను మాత్రం చిల్‌ అవుతున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. అక్కడితో ఆగకుండా యష్‌తో ఈ సీన్స్‌లో నటించిన అమెరికా అమ్మాయిని కూడా గీతూ పరిచయం చేశారు. ఆమె పేరు బీట్రీజ్ బాఖ్ అని తెలిపారు. అయితే దర్శకురాలి వివరణతో జనాలు సంతృప్తిపడేలా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఈ వివాదం అనూహ్య మలుపు తీసుకుంది.

మహిళా కమీషన్ సీరియస్
టాక్సిక్ సినిమా కంటెంట్‌పై సెన్సార్ బోర్డ్‌‌కు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. టీజర్‌లో మితిమీరిన హింస, అశ్లీల దృశ్యాలు ఉన్నాయని ఇవి పిల్లలపై దుష్ప్రభావం చూపుతాయని ఆరోపిస్తున్నారు. అలాగే టాక్సిస్ సినిమా దర్శక నిర్మాతలపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అటు ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. టాక్సిక్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కర్ణాటక మహిళా విభాగం.. మహిళా కమీషన్‌లో ఫిర్యాదు చేసింది. పబ్లిక్ డొమైన్‌లో విడుదల చేసిన టీజర్‌లోని సన్నివేశాలు మహిళల గౌరవాన్ని కించపరిచేవిగా, కన్నడ సంస్కృతిని అవమానించేవిలా ఉన్నాయని వాటిని తొలగించాలని లేఖలో కోరారు. దాంతో మహిళా కమీషన్ తక్షణం స్పందించింది. వెంటనే సెన్సార్ బోర్డ్‌కు లేఖ రాసి... టీజర్‌పై తగిన చర్యలు తీసుకుని, నివేదిక సమర్పించాలని పేర్కొంది. దీంతో రిలీజ్‌కు ముందే టాక్సిక్ ఇబ్బందుల్లో పడింది. ఈ నేపథ్యంలో విడుదల సమయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని సినీ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీనిపై హీరో యష్ ఎలా స్పందిస్తారో చూడాలి.

More from Filmibeat

Read more about: yash toxic geetu mohandas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X