twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యష్ క్రేజీ ప్రాజెక్ట్.. పాపులర్ దర్శకుడు, తమన్నాతో మూవీ

    |

    కేజీఎఫ్ చాప్టర్ 1 చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణను సంపాదించుకొన్న యష్ ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేజీఎఫ్2 సినిమాను ఓ పక్కన పూర్తి చేస్తూనే మరో సినిమాను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కన్నడ పరిశ్రమలో ప్రచారంలో ఉన్న వార్త ప్రకారం.. ప్రముఖ దర్శకుడు నార్తన్‌తో తదుపరి సినిమాను చేయడానికి సిద్దంగా ఉన్నట్టు తెలిసింది.

    నార్తన్, యష్ ఇద్దరి మధ్య కథా చర్చలు జనవరిలో జరిగాయ. నార్తన్ చెప్పిన కథను విన్న వెంటనే యష్ సినిమా చేయడానికి అంగీకరించారు. త్వరలోనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం యష్‌తో సరసన తమన్నా భాటియాను ఎంపిక చేయాలని నిర్ణయించుకొన్నారు. ఈ మధ్య తమన్నా వారు సంప్రదింపులు జరిపారు. ఆమె కూడా ఈ సినిమాలో భాగమయ్యేందుకు ఉత్సాహం చూపారు అని తాజాగా కథనాలు వెలువడ్డాయి.

    Yash to join hands with director Narthan after KGF: Chapter 2

    లాక్‌డౌన్ పరిస్థితులు చక్కబడిన తర్వాత నార్తన్, యష్ తమ సినిమాను ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అన్ని కుదిరితే ఈ ఏడాది చివర్లో సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి అవకాశం ఉంది అని కన్నడ సినీ వర్గాలు వెల్లడించాయి.

    ఇక దర్శకుడు నార్తన్ విషయానికి వస్తే శివ రాజ్‌కుమార్‌తో తీసిని ముఫ్తీ సినిమా సినీ ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి స్పందన అందుకొన్నది.

    ఇదిలా ఉంటే కేజీఎఫ్2 అక్టోబర్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, మాళవిక అవినాష్, సంజయ్ దత్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

    English summary
    Popular Kannada Actor Yash to join hands with director Narthan after KGF: Chapter 2. He is going to pair with Tamannaah Bhatia for his next. Now Yash is busy with KGF2 shooting. This movie is going to release on October 23.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X