KGF 2 ఫ్యాన్స్‌కు యష్ బంపర్ ఆఫర్.. రాకీ భాయ్ ప్రపంచంలో మీరు చేరిపోండి ఇలా..

కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 1 చిత్రం ఎవరూ ఊహించని విజయాన్ని చేజిక్కించుకొన్నది. దాంతో ఓవర్‌నైట్‌లో దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. దాంతో కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే కేజీఎఫ్ 1 రిలీజ్ అయిన మూడేళ్ల తర్వాత కేజీఎఫ్ 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ క్రమంలో తన అభిమానులకు, కేజీఎఫ్ ఫ్యాన్స్‌కు యష్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన యష్.. ఏమని ఆఫర్ ఇచ్చారంటే..

కేజీఎఫ్ చాప్టర్ 1 రిలీజై మూడేళ్లు గడిచింది. మా సినిమాను విశేషంగా ప్రేమించిన అభిమానులందరికి ధన్యవాదాలు తప్ప ఏమీ చేయలేకపోయాం. మమల్ని ఆదరించిన తీరు కారణంగా కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం మరింత స్పెషల్‌గా మార్చింది.

Yash Welcomes art work from fans fro Rocky Bhai Fandom promotion for KGF Chapter 2

కేజీఎఫ్ చాఫ్టర్ 2 చిత్రాన్ని మీ సినిమాగా మార్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ప్రమోషనల్‌ కార్యక్రమాల్లో మిమ్మల్ని భాగం చేయాలని అనుకొంటున్నాం. భారతీయ సినిమా చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా ఈ సినిమాను తొలిసారి హోర్డింగ్స్‌పై ప్రచారం చేయాలని అనుకొంటున్నాం. అందుకోసం మీరు వేసే ఆర్ట్ వర్క్‌ను ప్రమోషనల్ పోస్టర్లుగా హోర్డింగులపై ఉంచబోతున్నాం. ఈ రోజు నుంచి రాకీ భాయ్ పేరుతో ఆర్ట్ వర్క్‌ను మీరు షేర్ చేయండి. ఈ సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ క్యాంపెయిన్‌లో మీరు భాగం అవ్వండి అని యష్ తన పోస్టులో తెలిపారు.

అభిమానులు, ప్రేక్షకులు లేకుంటే కేజీఎఫ్ సినిమానే లేదు. ప్రపంచ పటంపై రాకీని పెట్టే ప్రమోషనల్ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం కండి. ఎందుకంటే ఆయన ఓ ప్రపంచాన్ని కోరుకొంటున్నారు అని కేజీఎఫ్ టీమ్ ట్వీట్ చేసిన పోస్టర్‌లో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X