For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సమంత సూపర్ ఎనర్జీతో మళ్లీ: శివలెంక.. యశోద 2, 3 సీక్వెల్స్‌కు లీడ్.. హరి, హరీష్

  |

  సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు టైటిల్ పాత్రలో నటించిన యశోద సినిమా విడుదలైన ప్రతీ చోట పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. సరోగసి నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించగా, దర్శక ద్వయం హరి, హరీష్ తెరకెక్కించారు.. నవంబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదలై సూపర్ హిట్ దిశగా బాక్సాఫీస్ ప్రయాణం సాగిస్తున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్ కార్యక్రమంలో క్రియేటివ్ డైరెక్టర్ హేమాంబర్ జాస్తి, ఆర్టిస్టులు దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ, మధురిమ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత రాజా సెంథిల్, ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సక్సెస్ మీట్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.

  గత ఐదు రోజులుగా భారీ కలెక్షన్లు

  గత ఐదు రోజులుగా భారీ కలెక్షన్లు


  యశోద చిత్రం విడుదల తర్వాత మొదటి ఆట నుంచి భారీ వసూళ్లను రాబట్టింది. తొలి రోజే 6 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. గత 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల గ్రాస్, 12 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. ఇలా భారీ వసూళ్లను సాధిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ఆనందంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్‌కు సంబంధించిన అనుభూతులను చిత్ర యూనిట్ పంచుకొన్నారు.

  సమంత వన్ ఉమెన్ షో

  సమంత వన్ ఉమెన్ షో


  నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. సమంత గారి వన్ ఉమన్ షో 'యశోద'. దర్శకులు హరి, హరీష్ కథ చెప్పిన తర్వాత.. పూర్తిస్థాయి స్క్రిప్టును సిద్దం చేశాం. స్క్రిప్టు పూర్తయిన తర్వాత యశోద పాత్రకు సమంత అయితే బాగుంటుందని అందరం అనుకొన్నాం. కథ వినగానే.. సమంత ఓకే చేశారు. కథ బాగా రావడంతో అన్ని భాషల్లో చేద్దామని నిర్ణయించుకొన్నాం. సమంత ఫెర్ఫార్మెన్స్ అద్బుతం. ఆవిడ మాకు మంచి ఎనర్జీ ఇచ్చారు. ప్రతీ ఒక్కరి జీవితంలో చీకటి వెలుగులు ఉంటాయి. సమంత మళ్లీ సూపర్ ఎనర్జీతో వస్తారు అని అన్నారు.

  యశోద 2 స్కోప్ ఉందంటూ..

  యశోద 2 స్కోప్ ఉందంటూ..


  యశోద కథ కొత్త పాయింట్‌ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో చేశాం. మా నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో నాకు మా సహ నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి గారు ఎంతో సపోర్ట్ చేశారు. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్లు రాజా సెంథిల్‌, రవికుమార్‌ సహకారం మరువలేను. ప్రతి ఒక్కరూ సినిమాను ప్రేమించి పనిచేశారు'' అని అన్నారు.
  యశోద రిలీజ్ తర్వాత యశోద 2 గురించి అడుగుతున్నారు. ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్తగా క్రైమ్స్ పుట్టుకు వస్తున్నాయి. వాటికి పరిష్కరాలూ ఉంటాయి. 'యశోద' సీక్వెల్ ప్రయత్నం హరి, హరీష్ నుంచి రావాలి అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు.

   యశోద 2nd, 3rd పార్ట్ ఉందంటూ హరీ, హరీష్

  యశోద 2nd, 3rd పార్ట్ ఉందంటూ హరీ, హరీష్

  దర్శకులు హరి, హరీష్ మాట్లాడుతూ.. తెలుగులో మాకు తొలి సినిమా. అన్ని భాషల నుంచి వస్తున్న స్పందన ఎంతో సంతోషాన్నిచ్చింది. మాకు ఇది చాలా మ్యాజికల్ మూమెంట్. యశోద సినిమాకు అవకాశం ఇచ్చిన కృష్ణప్రసాద్ గారికి థాంక్స్. సమంత గారికి చాలా పెద్ద థాంక్స్. ఆవిడ మాకు ఎంతోసపోర్ట్ చేశారు. వరలక్ష్మీ గారు వెర్సటైల్ యాక్టర్. మణిశర్మ గారు అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. మా కలను తమ ఆర్ట్ వర్క్ ద్వారా నిజం చేసిన అశోక్ గారికి థాంక్స్. సుకుమార్ గారు హాలీవుడ్స్థాయి విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి, పని చేసిన సాంకేతిక నిపుణులకుథాంక్స్. యశోద 2 మూవీ విషయంలో మాకు ఒక ఐడియా ఉంది. సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్‌కు లీడ్ కూడా ఉంది. అయితే... అది సమంత గారిపై ఆధారపడి ఉంది. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన తర్వాత, ఆవిడతో డిస్కస్ చేస్తాం. సమంతగారు ఒప్పుకుంటే సీక్వెల్స్ చేస్తాం. మా నిర్మాత గారూ రెడీగా ఉన్నారు అని అన్నారు.

  నిర్మాతది ట్రెండీ మనసు అంటూ డైలాగ్ రైటర్స్

  నిర్మాతది ట్రెండీ మనసు అంటూ డైలాగ్ రైటర్స్


  యశోద సినిమాకు మాటలు అందించిన రచయితలు పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ఈ క్షణం ఇక్కడ నిలబడటానికి కారణం మా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారు. మీరు రాయగలరు. రాయండి. మీ ఇద్దరూ సక్సెస్ అయితే చూడాలని ఉంది అని మమ్మల్ని ఆశీర్వదించారు. ముందుగా ఆయనకు థాంక్స్. తమిళ్ తెలిసిన అమ్మాయి, తెలుగు నేటివిటీ తెలిసిన అబ్బాయి కలిసి పని చేస్తే బావుంటుందని, కథకు న్యాయం చేస్తారని ఆయన అన్నారు. కృష్ణప్రసాద్ గారికి ఉన్న ట్రెండీ మనసు ఇంకొకరికి ఉండదు. మాకు అవకాశం ఇచ్చిన హరి, హరీష్ గారికి థాంక్స్. ఇద్దరు కలిసి ఎలా పని చేయాలోవాళ్ళ నుంచి నేర్చుకున్నాం అని అన్నారు.

  English summary
  Yashoda movie success meet: Samantha Ruth Prabu will come with Super Energy, Says Sivalenka Krishna Prasad
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X