Yashoda Trailer Review యూనివర్సల్ కాన్సెప్ట్‌తో యశోద.. హై యాక్షన్, ఎమోషన్స్‌తో సమంత అదుర్స్!
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యశోద. హైలీ ఎమోషనల్, యాక్షన్ అంశాలతో కలబోసవిన ఈ చిత్రాన్ని దర్శక ద్వయం హరీ, హరీష్ రూపొందించారు. అత్యంత వివాదాస్పదంగా మారిన అద్దె గర్బం (సర్రోగసి) అనే యూనివర్సల్ కాన్సెప్ట్‌ను తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 27వ తేదీన రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ వివరాల్లోకి వెళితే..

విజయ్ దేవరకొండ చేతుల మీదుగా
యశోదకు సంబంధించి ఇటీవల రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. దేశవ్యాప్తంగా ప్రేక్షకలు ముందుకు వస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అనగానే.. ఫ్యామిలీ ఆడియెన్స్, మహిళల్లో ఆసక్తిని కలిగించింది. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న యశోద ట్రైలర్‌ను క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు.

సమంతతో లవ్‌లో పడ్డాను అంటూ
సమంత రుత్ ప్రభు నటించిన యశోద ట్రైలర్‌ను రిలీజ్ చేస్తూ.. నేను కాలేజీ కుర్రాడిగా ఉన్నప్పుడు సమంతను బిగ్ స్క్రీన్ మీద చూసి ఒకప్పుడు ఆమెను చూసి ప్రేమలో పడ్డాను. ఇప్పుడు ఆమె వ్యక్తిత్వం, స్థాయిని చూసి ఆరాధిస్తున్నాను. ఇలాంటి సమయంలో సమంత రుత్ ప్రభు నటించిన కొత్త సినిమా యశోద మూవీ ట్రైలర్‌ను మీ కోసం చాలా సంతోషంగా నేను షేర్ చేస్తున్నాను అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు.

రెండు గుండెల చప్పుడు విన్నారా?
యశోద ట్రైలర్ విషయానికి వస్తే.. మీకు ఎప్పుడైనా రెండు గుండెల చప్పుడు వినిపించిందా? బిడ్డను కడుపున మోసే తల్లికి ఆ చప్పుడు వినిపిస్తుంది అనే ఎమోషనల్ డైలాగ్స్‌తో ట్రైలర్ మొదలైంది. ఇక వరలక్ష్మీ డాక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి.. మీరు కనే బిడ్డ ఏ బిగ్ షాట్ ఇంటికో వెళ్తుంది. ఆ బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాది. షారుక్ ఖాన్, ఆమీర్ ఖాన్, శిల్పాశెట్టి, సన్నీలియోన్ సరోగసి పేరేంట్సే లాంటి డైలాగ్స్‌తో ట్రైలర్ భావోద్వేగంగా కనిపించింది.

సరోగసి అంశం ప్రధానంగా
ఇక సరోగసి ప్రధానం పాయింట్‌గా జరిగే కథలో రాజకీయాలు, రాజకీయ నేతల కుట్రలు, కుతంత్రాలు సినిమా కథను మరింత ఆసక్తిగా మార్చింది. యాక్షన్ సన్నివేశాలు, ఫైట్స్‌లో సమంత ఫెర్ఫార్మెన్స్ పవర్‌ఫుల్‌గా కనిపించింది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత సమంత మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించేందుకు సిద్దమయ్యారు.

హ్యుమన్ ఎమోషన్స్ దట్టించి..
ఓవరాల్‌గా యశోద చిత్రం హ్యుమన్ ఎమోషన్స్‌తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ అనే భావాన్ని కలిగించడంలో సక్సెస్ అయింది. యశోద ఎవరో తెలుసు కదా? ఆ కృష్ణ పరమాత్ముడిని పెంచిన తల్లి అంటూ సమంత చెప్పిన డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ట్రైలర్‌ను పర్‌ఫెక్ట్‌గా కట్ చేశారు. యూనివర్సల్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాకు డైలాగ్స్‌ను పులగం చిన్నారాయణ, భాగ్యలక్ష్మీ అందించారు. ఈ ట్రైలర్‌లో కాన్సెప్ట్‌తోపాటు డైలాగ్స్ కూడా ఆకట్టుకొన్నాయని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











