Toxic: ‘టాక్సిక్' మళ్లీ వాయిదా.. అసలు కారణం ఇదేనంటున్న యష్..

కన్నడ రాకింగ్ స్టార్ యష్ (Yash)హీరోగా, డైరెక్టర్ గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ టాక్సిక్ ( Toxic: A Fairy Tale for Grown-ups). ఈ సినిమా ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 'కేజీఎఫ్' ఫ్రాంచైజీతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యష్, ఈసారి మరింత పెద్ద విజన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. భారీ బడ్జెట్, అంతర్జాతీయ ప్రమాణాలు, భారీ స్థాయిలో ప్రణాళికలు ఇవన్నీ కలగలిపి 'టాక్సిక్'ను గ్లోబల్ ప్రాజెక్ట్‌గా మలుస్తున్నాయి. అయితే.. కానీ సినిమా విడుదల విషయంలో అనుకున్నదే జరిగింది. ఈ క్రమంలో హీరో యష్ కీలక ప్రకటన చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?

టాక్సిక్ మూవీని మొదట మార్చి 19న విడుదల చేయాలని ప్రకటించారు. కానీ నిర్మాణ సంబంధిత కారణాల వల్ల జూన్ 4కి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఆ తేదీ కూడా మారడంతో ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో యష్ స్వయంగా ముందుకొచ్చి విడుదల వాయిదాపై స్పష్టత ఇచ్చారు. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో 'టాక్సిక్'కు వచ్చిన అంతర్జాతీయ స్పందన తమ ఆలోచనలను మార్చిందని ఆయన వెల్లడించారు. ఈ సినిమా కేవలం ఇండియా వరకు పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి గ్రాండ్‌గా విడుదల కావాలంటే సరైన ప్రణాళిక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

Yash s Toxic Release Delayed Again Global Strategy Behind Big Decision Revealed

యష్ చెప్పిన వివరాల ప్రకారం.. సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం మేకర్స్ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను సెట్ చేయడం, అంతర్జాతీయ భాగస్వామ్యాలను ఫైనలైజ్ చేయడం వంటి కీలక దశలో ఉన్నారు. హాలీవుడ్ స్థాయిలో విడుదల ప్లాన్ చేయాలంటే సమన్వయం చాలా అవసరం అవుతుందని, అందుకే తొందరపడకుండా పూర్తి ప్రిపరేషన్‌తో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు.

అయితే అధికారిక కారణాలకే పరిమితం కాకుండా, ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మరికొన్ని అంశాలు కూడా ఈ వాయిదాకు కారణమయ్యాయి. ముఖ్యంగా ఓటీటీ హక్కుల విషయంలో భారీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్ వేచినట్టు తెలుస్తోంది. ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సుమారు రూ. 110 కోట్ల ఆఫర్ ఇచ్చినా, నిర్మాతలు దానికి రెట్టింపు స్థాయిలో డీల్ కోరుతున్నారని సమాచారం. ఈ ఒప్పందం ఇంకా ఫైనల్ కాకపోవడం కూడా రిలీజ్ డేట్‌ను ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది.

అలాగే.. ఇక టెక్నికల్ పరంగా కూడా కొన్ని పనులు ఇంకా పూర్తి కాలేదని టాక్. సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ, చిన్నపాటి ప్యాచ్‌వర్క్, పోస్ట్-ప్రొడక్షన్ ఫైనల్ టచ్‌లు ఇంకా మిగిలి ఉన్నాయని తెలుస్తోంది. ఇవన్నీ పూర్తయిన తర్వాతే సెన్సార్ సర్టిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంతేకాకుండా, గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను కూడా పరిశీలిస్తూ, సరైన సమయానికే విడుదల చేయాలని భావిస్తున్నారు.

మరోవైపు, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రస్తుతం 'KD: The Devil' సినిమా విడుదల పనుల్లో నిమగ్నమై ఉంది. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాకే 'టాక్సిక్' ప్రమోషన్స్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ప్లాన్ చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్ చేయాలంటే భారీ ప్రణాళిక అవసరం అవుతుందని, అందుకే ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని చూస్తున్నారు. ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ సహా పలు భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

దీంతో 'టాక్సిక్'కు పాన్-ఇండియా కంటే ఎక్కువగా, పాన్-వరల్డ్ స్థాయిలో క్రేజ్ ఏర్పడే అవకాశముంది. యష్ కూడా ఈ సినిమాపై భారీ నమ్మకం వ్యక్తం చేస్తూ, ఇది ఇండియన్ సినిమాకు గర్వకారణంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా 'టాక్సిక్' రిలీజ్ వాయిదా అభిమానులకు తాత్కాలిక నిరాశ కలిగించినా, దీని వెనుక ఉన్న వ్యూహం మాత్రం సినిమాను మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తోంది. అయితే.. విడుదల తరువాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తోందో వేచి చూడాలి.

Read more about: toxic movie yash kgf
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X