For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTRకు యష్ మాస్టర్ అదిరిపోయే డెడికేషన్.. ఏకంగా భార్యతో కలిసి అలా!

  |

  HBD JrNTR: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ ఈరోజు 38వ పుట్టిన రోజు నేడు(మే 20) జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులతో పాటు పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీస్ బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. వారే కాక పలు నిర్మాణ సంస్థలు సైతం సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాయి. ఇక ఎన్టీఆర్ పేరు అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అయితే ఈ అన్నిటి కంటే కొరియోగ్రాఫర్‌గా మారిన యశ్వంత్ మాస్టర్ ఒక స్పెషల్ సాంగ్ చేసి డెడికేట్ చేశారు. అది ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

  ఎన్టీఆర్ ఫ్యాన్ యష్

  ఎన్టీఆర్ ఫ్యాన్ యష్

  ఈటీవీలో ప్రసారమైన ‘ఢీ' డాన్స్ షో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ షో పాపులర్ కావడమే కాక ఈ షో ద్వారా చాలా మంది యంగ్ టాలెంట్ ఉన్న డాన్సర్లు వెలుగులోకి వచ్చారు. ఈ డాన్స్ షో ద్వారా పాపులర్ అయిన యశ్వంత్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా సినిమాల్లో కూడా తన సత్తా చాటుతున్నారు. ఆయన తన అభిమాన హీరో ఎన్టీఆర్ అని చెబుతూ ఉంటారు. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఒక స్పెషల్ సాంగ్ చేశారు.

  భార్యతో రచ్చ

  భార్యతో రచ్చ

  నిజానికి యష్ ఈ మధ్యనే పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాడు. అయితే ఆయన పెళ్లయి రెండేళ్లు కూడా పూర్తయింది. యష్ మాస్టర్ తన ప్రేయసి వర్షనే పెళ్ళాడారు. అయితే వీరు ప్రేమలో పడ్డాక పెద్దలను ఒప్పించి చేసుకోవడానికి దాదాపు 8 ఏళ్లు సమయం పట్టింది. తన చిన్ననాటి స్నేహితురాలు అయిన వర్షను కాలేజీ రోజుల్లోనే ఇష్ట పడ్డారు యశ్వంత్.

  షోలలో సైతం కలిసే

  షోలలో సైతం కలిసే

  ఇక యశ్వంత్ మరియు వర్ష తరచు తమ ఫోటోలు, డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటారు. ఇప్పటికే డాన్స్ + తో పాటు, క్యాష్, వావ్ లాంటి కొన్ని టీవీ షోలలో కూడా అతిథులుగా కనిపించారు. డాన్స్ + షో లో అయితే చాలా ఎపిసోడ్స్ లో వర్ష కనిపించి కాసేపు ఎంటర్ టైన్ చేశారు.

  ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్

  ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్

  తాజాగా ఈ ఇద్దరూ సంకేత్ లాంటి మరో ఇద్దరు డ్యాన్సర్స్ తో కలిసి ఒక స్పెషల్ వీడియో చేసి ట్రీట్ ఇచ్చారు. ''జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజున, నెటిజన్లు తమ ప్రేమను, శుభాకాంక్షలను కురిపిస్తున్నారు. యశ్వంత్ మాస్టర్, తన భార్య వర్ష, సంకేత్ మరో ఇద్దరితో కలిసి యం పేరు మురుగన్ అనే సాంగ్ కి నర్తించారు. నా అల్లుడు సినిమాలోని ఆ పాటకి అదిరిపోయే స్టెప్స్ వేశారు.

  Actor Nani Biography వివాదాలను హుందా గా ఎదుర్కున్న స్టార్!! || Filmibeat Telugu

  అలా కనిపించి షాక్


  అంతే కాక ఈ సాంగ్ మొత్తం మీద పక్కా మాస్ లుక్స్ కనిపించారు. యష్ తో పాటు భార్య వర్ష కూడా మాస్క్ లుక్ లో రచ్చ రేపింది. స్వతహాగా ఎయిర్ ప్లేన్ లో కాబిన్ క్రూగా పని చేసే ఆమె ప్రొఫెషనల్ డ్యాన్సర్ కి ఏ మాత్రం తగ్గకుండా కాలు కదిపింది. ఇక ఈ సాంగ్ ను యష్ అడ్డా అనే యూట్యూబ్ చానల్ లో రిలీజ్ చేయగా అది #3 ట్రెండింగ్ లో ఉంది. ఇంకెందుకు మీరు కూడా చూసేయండి మరి.

  English summary
  On Jr NTR's birthday, netizens are pouring their love and wishes. On the same way Dhee fame Yashwanth Master dedicated a song for JrNTR. Yashwanth Master with his wife Varsha, Sanketh, and few others performed a special song performance to "Yem Peeru Murugan."
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X