Yatra 2: ఓడించలేకపోతే అంతం చేయాలట.. యాత్ర-2లో సోనియా గాంధీ, ఈ లుక్ చూశారా?
Yatra 2 Soniya Gandhi Look: ఈ మధ్య కాలంలో బయోపిక్ లు తీయడం చాలా కామన్ అయిపోయింది. గతంలో ఎవరిదైనా బయోపిక్ పుస్తకంగా రాసే ఆలోచనలు ఎక్కువగా చేయగా.. ఇప్పుడు మాత్రం రాజకీయ, సినీ, క్రీడా రంగాల ప్రముఖు జీవితాలను సినిమాలుగా తీస్తున్నారు. ఇవి సూపర్ హిట్లుగా నిలుస్తుండడంతో అంతా అదే దారిలో వెళ్తున్నారు. అయితే కొన్నేళ్ల క్రితమే తెలుగు రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించిన జన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత ఆధారంగా యాత్ర అనే సినిమా తీశారు. అది కాస్త హిట్టు కావడంతో దానికి సీక్వెల్ గా మరో చిత్రాన్ని తీసుకు రాబోతున్నారనే విషయం అందరికీ తెలిసిందే.
అయితే ఈ యాత్ర 2 సినిమా చేయబోతున్నట్లు డైరెక్టర్ మహీ వీ రాఘవ్ ప్రకటించినప్పటి నుంచి అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈ సినిమా వస్తే.. వైసీపీకీ చాలా ప్లస్ అవుతుందని అంతా భావిస్తున్నారు. అయితే ఈ సినిమా చేస్తానని ప్రకటించిన వెంటనే కోలీవుడ్ హీరో జీవాతో యాత్ర 2 టైటిల్ పోస్టర్ ను విడుదల చేసిన చిత్రబృందం.. ఆ తర్వాత కొంత కాలానికే మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ రెండింటికీ విశేష స్పందన వచ్చింది. ఈక్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్ డేట్ ను వదిలారు.

యాత్ర 2 చిత్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి, ఆయన కొడుకు జగన్ మోహన్ రెడ్డి పాత్రలో.. తమిళ హీరో, ప్రొడ్యూసర్ ఆర్బీ చౌదరి కొడుకు జీవా నటించబోతున్నారు. అలాగే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాత్రలో మహేష్ మంజ్రేకర్ కనిపించనున్నారు. ఈ విషయాలన్నీ మనకు ఇప్పటికే తెలియగా.. తాజాగా చిత్రబృందం ఈ సినిమాలో మరో క్యారెక్టర్ ను రివీల్ చేసింది. ఆ క్యారెక్టర్ ఏంటీ అనుకుంటున్నారా... కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ. అయితే సోనియా గాంధీ పాత్రలో జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ నటిస్తున్నారు. ఆ లుక్ పోస్టర్ నే చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.
సోనియా గాంధీ లుక్ లో సుజానే అదరగొట్టారు. కాటన్ చీర కట్టుకొని సింపుల్ గా వన్ సైడ్ వాచ్ పెట్టుకొని... షార్ట్ హెయిర్ తో స్పెక్స్ పెట్టుకొని చాలా కోపంగా చూస్తూ కనిపించారు సుజానే. ఈ లుక్ చూడగానే మనకు సోనియా గాంధీయే గుర్తుకు వస్తారు. అయితే ఈ పోస్టర్ పై ఇఫ్ యు కాంట్ డిఫీట్ హిమ్.. డెస్ట్రాయ్ హిమ్ అని రాసి ఉంది. మీరు ఓడించలేకపోతే అతడి అంతం చేయమని చెబుతున్న ఈ కొటేషన్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించే చెప్పినట్లు అర్థం అవుతుంది. అయితే సోనియా గాంధీ ఇలా ఎవరి గురించి చెప్పారో తెలయాలంటే మాత్రం సినిమాను కచ్చితంగా చూడాల్సిందే.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర, జైలు జీవితం ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలతో కలిసి శివ మేక నిర్మిస్తున్నారు. అయితే యాత్ర సినిమా 20190 ఫిబ్రవరి 8వ తేదీన విడుదల కాగా.. ఇదే తేదీన పార్ట్ 2 అయిన యాత్ర 2ను విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. ఈక్రమంలోనే వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో.


Click it and Unblock the Notifications











