Yatra 2 Pre Release Review వైస్ జగన్ బయోపిక్ ముందు భారీ కలెక్షన్ల టార్గెట్.. ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే?

యువ దర్శకుడు మహీ వీ రాఘవ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, తమిళ స్టార్ హీరో జీవా, మరాఠీ నటి కేతకీ నారాయణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం యాత్ర 2. గతంలో రిలీజైన యాత్ర సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా వస్తున్నది. ఈ చిత్రానికి మేక శివ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన రిలీజవుతున్న ఈ సినిమా విశేషాల వివరాల్లోకి వెళితే..

యాత్ర 2 సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన యదార్ధ సంఘటనలకు సినిమాటిక్ రూపమే అని దర్శకుడు మహీ వీ రాఘవ చెప్పారు. ఇక ఈ సినిమా 2009 నుంచి 2019 వరకు జరిగిన సంఘటనల్లో ప్రధానమైన వాటిని తీసుకొని తెరకెక్కించినట్టు చెప్పారు.

Yatra 2 Pre Release Review: Will YS Jagan biopic chase box office Target

ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటిస్తుండగా.. వైఎస్ జగన్‌గా జీవా, వైఎస్ భారతీగా కేతకీ నారాయణ్ నటిస్తున్నారు. అయితే వైఎస్ జగన్ పాత్ర కోసం మూడు నెలలపాటు ప్రిపేర్, వర్కవుట్ చేశాను. వ్యక్తిగతం ఆయనను కలువలేదు కానీ.. ఆయన వీడియోలు చూసి హావభావాలు, ఇతర అంశాలు నేర్చుకొన్నాను అని జీవా చెప్పారు. కేతకీ కూడా భారతీ వీడియోలు చేసి ఆమె ఎలా ఉంటుంది? ఎలా వ్యవహరిస్తుందనే విషయాలను తెలుసుకొన్నాను చెప్పారు.

అయితే యాత్ర 2 సినిమాలో ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషన్స్ ఖర్చులతో కలిపి 40 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు. కానీ ఈ సినిమాను కొనుగోలు చేయడానికి బయ్యర్లు రాకపోవడంతో సొంతంగా రిలీజ్ చేసుకొంటున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పంపిణీ చేస్తుందని తెలిసింది.

Yatra 2 Pre Release Review: Will YS Jagan biopic chase box office Target

ఇక యాత్ర 2 బ్రేక్ ఈవెన్ లక్ష్యం భారీగానే ఉంది. ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే సుమారుగా 30 కోట్ల రూపాయలను థియేట్రికల్ వ్యాల్యూ కట్టారు. దాంతో ఈ సినిమా కనీసం 60 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా ఈ రేంజ్ కలెక్షన్లు చేస్తుందా? ఎంత వరకు కలెక్షన్లను రాబడుతుందనే విషయం కొద్ది రోజులు ఆగి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X