పేదరికాన్ని పోగొట్టేందుకు వైఎస్ఆర్ చేసిన కృషికి దర్పణం... ‘యాత్ర’ ట్రైలర్!
దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ 'యాత్ర' ట్రైలర్ విడుదలైంది. ''నా విధేయతను, విశ్వాసాన్ని బలహీనతగా తీసుకోవద్దు'' అంటూ వైఎస్ఆర్ తన పార్టీ హై కమాండ్‌తో చెప్పే డైలాగులతో విడుదలైన ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.
''నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకోగలిగాం కానీ... జనాలకు ఏం కావాలో తెలుసుకోలేకపోయాం.. తెలుసుకోవాలని ఉంది.. వినాలని ఉంది.. ఈ కడప దాటి ప్రతి గడపలోకి వెళ్లాలని ఉంది..'' అంటూ వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి చెప్పే డైలాగులు ట్రైలర్లో హైలెట్ అయ్యాయి.
''ఈ ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద జబ్బు కేన్సరో.. గుండె జబ్బో కాదయ్యా.. పేదరికం, పేదరికాన్ని మించి శిక్షేలేదు'' అని భావించిన వైఎస్ఆర్ అధికారంలోకి రాకముందు తన పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పేదల కష్టాలు, వారికి ఏం కావాలో అడిగి తెలుసుకున్నారు. ఇదే విషయాన్ని 'యాత్ర'లో చూపించబోతున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
తన పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి వారికి అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీఅంబర్స్మెంట్, పావలా వడ్డీ రుణాలు లాంటి పథకాలు ఎంతో మంది పేదలకు హెల్ప్ అయ్యాయి.

'ఆనందో బ్రహ్మ వంటి' సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మళయాలంలో 'యాత్ర' ఫిబ్రవరి 8న రిలీజ్ కాబోతోంది. మమ్ముట్టి(వైఎస్ఆర్), రావ్ రమేష్, జగపతిబాబు(వైఎస్ రాజారెడ్డి), సుహాసిని(సబితా ఇంద్రారెడ్డి), అనసూయ, పోసాని, సచిన్ కడ్కర్, ఆశ్రిత వేముగంటి(వైఎస్ విజయమ్మ), వినోద్ కుమార్, జీవా, 30 ఇయర్స్ పృథ్వి ముఖ్య పాత్రలు పోషించిన ఈచిత్రానికి సినిమాటోగ్రాఫర్ - సత్యన్ సూర్యన్, మ్యూజిక్ - కె ( క్రిష్ణ కుమార్ ), ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్, సాహిత్యం - సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ప్రొడక్షన్ డిజైన్ - రామకృష్ణ, మోనిక సబ్బాని, సౌండ్ డిజైన్ - సింక్ సౌండ్, సమర్పణ - శివ మేక, బ్యానర్ - 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్, నిర్మాతలు - విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - మహి వి రాఘవ్.


Click it and Unblock the Notifications











