Don't Miss!
- News
డీఎంకే ప్రభుత్వ పెద్దలతో ఏపీ మంత్రులు- చెన్నైలో కీలక భేటీ..!!
- Finance
Indian IT in US: అమెరికాలో భారతీయుల అగచాట్లు.. 60 రోజులే డెడ్ లైన్ !!
- Sports
పెళ్లితో ఒక్కటయ్యాం.. ఆశీర్వదించండి: కేఎల్ రాహుల్
- Lifestyle
పురుషులు ఎదుర్కొనే శీఘ్ర స్కలన సమస్యలకు కొన్ని సింపుల్ హోం రెమెడీస్!
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్దామంటూ కమెడియన్ అలీ షాకింగ్ కామెంట్స్.. గెలుపు ఖాయమని అంటూ..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కమెడియన్ ఆలీ ఇప్పుడు కూడా సినిమాలో కొనసాగిస్తూనే మరొకవైపు రాజకీయ నేతగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కమెడియన్ ఆలీకి ప్రభుత్వ సలహాదారుడిగా కూడా పోస్ట్ కూడా ఇచ్చారు. అయితే అప్పుడప్పుడు రాజకీయాలకు సంబంధించిన మీటింగ్స్ లో పాల్గొంటు ప్రత్యర్థులపై కూడా కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ పై కూడా అతను చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాలలోకి వెళితే..

గతంలో స్నేహంగా..
టాలీవుడ్ సీనియర్ నటుడు కమెడియన్ అలీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కు ఎంత సన్నిహితంగా ఉండేవారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కమెడియన్ అలీని తన సినిమాల్లో ఉండనిచ్చే విధంగా దర్శకులతో మాట్లాడేవాడు. ఇక చాలా కాలం పాటు వీరి మధ్య స్నేహం కొనసాగింది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వీరీ కాంబినేషన్స్ కు మంచి గుర్తింపు లభించింది.

పాలిటిక్స్ వలన విబేధాలు
అయితే మధ్యలో మాత్రం రాజకీయపరంగా వీరికి తీవ్రస్థాయిలో విభేదాలు రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గత ఎన్నికల్లో ప్రచారాలు నిర్వహించడమే కాకుండా పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ కూడా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఆలీ పేరు ఎత్తకుండానే కౌంటర్ ఇచ్చిన ప్రయత్నం చేశారు. దీంతో మీరు మధ్యలో గ్యాప్ వచ్చేసింది.

రాజకీయాలలో బిజీగా అలీ
ఇక ఆలీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆలీ రెగ్యులర్ రాజకీయాల్లో బిజీ అయ్యేవిధంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే అప్పుడప్పుడు పార్టీకి సంబంధించిన వ్యవహారాలలో కూడా పాల్గొంటున్నారు. ఇక ప్రెస్ మీట్ లు పెట్టినప్పుడు వైయస్సార్ ప్రభుత్వం గురించి చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కు పోటీగా
అయితే కమెడియన్ అలీ ఇటీవల పవన్ కళ్యాణ్ పై మరోసారి ఊహించిన విధంగా కామెంట్ చేశాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీ చేసేందుకు కూడా తాను సిద్ధము అని తెలియజేశారు. ఏపీ ముఖ్యమంత్రి ఆదేశిస్తే తాను ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తాను అని ఎదురుగా ఎవరు ఉన్నా కూడా ఎన్నికలకు సిద్ధమే అని ఛాలెంజ్ విసరడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

సినిమాలు వేరు, పాలిటిక్స్ వేరు
అంతే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రజలకు చాలా మంచి చేస్తుంది అని ఆ విషయం ప్రజలకు కూడా తెలుసు అని అన్నారు. అదేవిధంగా సినిమాలు వేరు రాజకీయాలు వేరు అంటూ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అన్ని ఏరియాలో కూడా మంచి విజయాన్ని అందుకుంటుంది అని అన్నారు. చిత్తూరు జిల్లా నగరి పర్యటనలో భాగంగా అలీ ఈ విదంగా స్పందించారు.