"పుష్ప 2" పై వైసీపీ సానుభూతి .. గతంలో కొట్టిన దెబ్బని అల్లు ఫ్యాన్స్ మర్చిపోయారా?
ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా ఉన్న బిగ్గెస్ట్ సీక్వెల్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ది రూల్ అనే చెప్పాలి. కాగా ఈ సినిమా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునాయాసంగా 1000 కోట్ల మార్కుని దాటుతుందని ట్రేడ్ వర్గాల్లో డిస్కషన్స్ నడుస్తున్నాయి.
ఇలా అంతకంతకూ భారీ హైప్ ని సెట్ చేసుకుంటూ వెళుతుండగా బయట రాష్ట్రాల్లో పరిస్థితి ఒకటైతే మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఒకటి అని చెప్పాలి. కాగా తెలుగు స్టేట్స్ లో కూడా హైప్ బాగానే ఉంది కాని మెగాభిమానులు మాత్రం ఇపుడు అల్లు అర్జున్ విషయంలో అంత సుముఖంగా లేరని చెప్పాలి. కాగా దీనికి కారణం పాలిటిక్స్.

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అల్లు అర్జున్ ఏపీ గత అధికార పార్టీ వైసీపీ అభ్యర్థికి సపోర్టుగా వెళ్లడం మెగా అభిమానులకి ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. ఇక అక్కడ నుంచి మొదలైన రచ్చ నేటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఇది కాస్తా మెగా ఫ్యాన్స్ నుంచి రాజకీయ కోణంలోకి వెళుతుంది అని చెప్పాలి.
కాగా అల్లు అర్జున్ అండ్ పుష్ప 2 సినిమాపై వైసీపీ పార్టీ కి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తదితరులు సపోర్ట్ చేస్తూ మాట్లాడ్డం తెలుగు నాట వైరల్ గా మారింది. అల్లు అర్జున్ పుష్ప 2 ఆపడం ఎవరి తరం కాదని బహిరంగంగా సపోర్ట్ చేస్తూ ఆయన మాట్లాడుతున్నారు. అయితే వైసీపీ నేతలు అల్లు ఫాన్స్ ని తమ ట్రాప్ లో వేసుకునే పనిలో ఉన్నారని కొందరు అంటున్నారు.

ఇప్పుడు ఎలాగో మెగా ఫ్యాన్స్ కి అల్లు ఫ్యాన్స్ కి గొడవలు జరుగుతున్న తరుణంలో దీనిని వారికి ప్లస్ గా మార్చుకునే పనిలో ఉన్నారని నెట్టింట కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడే అల్లు అర్జున్ ఫాన్స్ ఒక అంశాన్ని మర్చిపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే కపట ప్రేమ చూపిస్తున్నారో అదే వైసీపీ నేతలు పుష్ప పార్ట్ 1 రిలీజ్ టైంలో సినిమాకి హైక్స్ ఇవ్వలేదు. దానికి మించి స్పెషల్ షోస్ కి కూడా ఎలాంటి పర్మిషన్ ఇవ్వకుండా ఎలా ఇబ్బంది పెట్టారో మర్చిపోతున్నారా అని కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
ఇప్పుడు అంటే కలహాలు ఉండొచ్చు కానీ గతంలో ఇబ్బంది పెట్టినవారు ఇపుడు మీకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు అంటే అది మిమ్మల్ని, మీ ఎమోషన్స్ ని వాడుకునే ప్రయత్నమే అంటూ వాళ్లు హితవు పలుకుతున్నారు. బన్నీ ఫ్యాన్స్ గతంలో ఇదే వైసీపీ నాయకులు ఉన్న ప్రభుత్వం పార్ట్ 1 కి పెట్టిన ఇబ్బందులు మర్చిపోయి వారి ట్రాప్ లో పడతారా లేక చాకచక్యంగా వ్యవహరిస్తారా అనేది చూడాలి. ఇక ఈ పాన్ ఇండియా అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ఈ డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.


Click it and Unblock the Notifications











