2020 ఫ్లాష్‌బ్యాక్: అంచనాలు చేరలేకపోయిన అగ్రతారలు.. బోల్తా కొట్టిన సినిమాలు ఇవే
తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2020 సంవత్సరం చేదు అనుభవాన్ని మిగిల్చింది. లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో ఎన్నో సినిమాల రిలీజ్ ఆగిపోయాయి. అయితే తమపై పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకోలేక పలు సినిమాలను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
దాదాపు 40 సినిమాలు రిలీజ్ అయితే అందులో పట్టుమని 10 చిత్రాలు కూడా హిట్లుగా నమోదు చేసుకోలేకపోయాయి. అటు ప్రేక్షకులను, నిర్మాతలను నిరాశలో ముంచెత్తాయి.

అగ్రహీరోలు, హీరోయిన్ల విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్, సుధీర్ బాబు, నాని కాంబినేషన్‌లో వచ్చిన V చిత్రం, అలాగే కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా, అనుష్క శెట్టి, మాధవన్ నటించిన నిశ్శబ్దం చిత్రాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోలేకపోయాయి.
అయితే భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రాలు భారీగా బోల్తాపడ్డాయి. వాటిలో రాంగోపాల్ వర్మ రూపొందించిన బ్యూటిఫుల్, ప్రెజర్ కుక్కర్, 47 రోజులు, పెంగ్విన్, బొంబాట్, ఐఐటీ కృష్ణమూర్తి, గువ్వ గోరింక చిత్రాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











