Year End 2023: ఈ ఏడాది వందకోట్ల వసూళ్లు చేసిన టాప్ తెలుగు సినిమాలివే.. ఈ చిత్రాలన్నీ మీరు చాశారా?

మరికొన్ని రోజులు గడిస్తే 2023 పూర్తి అయిపోతుంది. మరో కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెడతాం. అయితే ఈ ఏడాది తెలుగులో అనేక సినిమాలు వచ్చాయి. పెద్ద పెద్ద స్టార్ హీరోల నుంచి చిన్న చిన్న హీరోల వరకు చాలా మంది హిట్ల కోసం గట్టిగానే కష్టపడ్డారు. అంతేకాదు బాక్సాఫీసును షేక్ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. కానీ ఈ ఏడాది కొన్ని చిత్రాలు మాత్రమే వంద కోట్ల వసూళ్లు రాబట్టుకున్నాయి. అంతకు మించి కూడా వసూలు చేశాయి. కానీ వంద కంటే తక్కువ వసూలు చేసిన సినిమాలు ఏవి, ఆ లిస్టు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2023 సంక్రాంతి కానుకగా విడుదల అయిన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య ఎవరూ ఊహించని స్థాయిలో హిట్టు కొట్టింది. ముఖ్యంగా బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరు తమ్ముడిగా రవితేజ కనిపించారు. అలాగే శృతి హాసన్, కేథరిన్ థ్రెసా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ లు నిర్మించగా... 225.7 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టుకుంది.

Year End 2023: 100 Crore Telugu Movies 2023 Check Details

అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా.. రామాయణ ఇతిహాసాన్ని ఆదిపురుష్ పేరుతో తెరకెక్కించారు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్. జూన్ 16వ తేదీన చాలా గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ... భారీగానే వసూళ్లు సాధించింది. ముఖ్యంగా రూ.184.87 కోట్లు వసూలు చేసింది.

ఇటీవలే నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ముఖ్యంగా కాజల్ అగర్వాల్, శ్రీలీలలు హీరోయిన్లుగా నటించి ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ విలన్ గా కనిపించారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, పరీష్ పెద్దిరాజు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించిన ఈ సినిమా రూ.140 కోట్ల వసూళ్లను సాధించి సెన్సేషన్ క్రియేట్ అయింది.

Year End 2023: 100 Crore Telugu Movies 2023 Check Details

అలాగే 2023 సంక్రాంతి సందర్భంగా విడుదల అయిన వీర సింహారెడ్డి సినిమా కూడా 100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించి మెప్పించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ లు నిర్మించారు. ఈ సినిమా రూ.133 కోట్లు వసూళ్లు చేసింది.

నేచురల్ స్టార్ నాని హీరోగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించగా... సముద్రఖని, దీక్షిత్ శెట్టి, సాయి కుమార్, షామ్నా కాసిమ్, సజోల్ చౌదరిలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను నిర్మించగా... రూ.117.15 కోట్ల వసూళ్లు సాధించింది.

Year End 2023: 100 Crore Telugu Movies 2023 Check Details

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయితేజ్ కాంబోలో వచ్చిన బ్రో మూవీ కూడా హిట్టుగా నిలిచింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టీరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు.. టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం, సుబ్బరాజు ప్రధాన పాత్రలో కనిపించిన ఈ సినిమా జులై 28వ తేదీన విడుదల అయింది. సముద్రఖని డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు రూ.110 కోట్ల వసూళ్లు వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X