Year Ender 2023: ఈ పాటలు వింటే చాలు హీటెక్కిపోతారు.. 2023 టాప్ రొమాంటిక్ హిట్ సాంగ్స్ ఇవే..!
మరికొన్ని రోజుల్లో 2023 సంవత్సరానికి మనం గుడ్ బై చెప్పబోతున్నాం. ఈక్రమంలోనే ఈ ఏడాది వచ్చిన అనేక సినిమాలు, పాటలతో మనం ఫుల్ గా ఎంజాయ్ చేశాం. అయితే టాప్ హిట్టు సినిమాలేవి, పాటలేవి, వంటివి చాలా తెలుసుకనే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అద్భుతమైన పాటల లిస్టు మొత్తం ఒక్కటే చోట చేర్చి ఇచ్చే వాళ్లు కూడా ఉంటరు. కానీ మీకోసం మేము అద్భుతమైన రొమాంటిక్ హిట్ 2023 తెలుగు పాటల లిస్టును విడదల చేయబోతున్నాం. అయితే ఆ పాటలు ఏ సినిమాలోవో కూడా చెబుతాం. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి.
1. నిజమేనే చెబుతున్నా జానే జానా... ఈ పాట ఊరు పేరు భైరవ్ కోనకు సంబంధించింది. అలాగే సినిమా రిలీజ్ కు ముందే వచ్చిన ఈ పాట యూట్యూబ్ ను షేర్ చేసి ట్రెండింగ్ లో నిలిచింది. అనేక మంది తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ సాంగ్ కా మారిపోయింది.

2. ఏ రెండు ప్రేమ మేఘాలిలా... ఆనంద్ దేవరకొండ, వైష్ణవిలు జంటగా నటించిన బేబీ సినిమాలోని ఈ పాట అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ గా మారిపోయింది. టాప్ ట్రెండింగ్ లో నిలిచిన ఈ పాటను శ్రీరామ చంద్ర, విజయ్ లు పాడారు.
3. పొట్టి పిల్లా, పొట్టి పిల్లా నువ్వే నాకు దిక్కు మల్లా... ఆ అధ్భుతమైన పాట బలగం సినిమాలోనిది. రామ్ మిర్యాల పాడిన ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
4. వెళ్లకే.. వెళ్లకే. అలేఖ్య హారిక ప్రధాన పాత్రలో వచ్చిన ఈ పాట కూడా నెట్టింటిని షేక్ చేసింది. ఇప్పటికీ చాలా మంది ఈ పాటను వింటూనే ఉన్నారు. భరత్ సౌరభ్, అనిరుధ్, రవిచందర్, ఎస్.విజయ్ పాడిన ఈ పాట ాలా అద్భుతంగా ఉంది.
5. ప్రియ మిథునం.. ఆదిపురుష్ సినిమాలోని ఈ పాట కూడా అద్బుతంగా ఉంది. అజయ్ అతుల్, కార్తీక్, శ్వేతా మోహనన్ లు కలిసి పాడిన ఈ పాట అనేక మందికి ఫేవరెట్ అయిపోయింది.
6. సుట్టమ్ లా సూసి... గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలోని ఈ పాట కూడా అద్భుతంగా ఉండి అందరినీ అలరిసతోంది. యున్ శంకర్ రాజా, అనరాగ్ కులకర్ణిలు ఈ మనోహరమైన రొమాంటిక్ పాటను ఆలపించారు.
7. దర్శనా ఓ దర్శనా... వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలోని ఈ పాట కూడా అదిరిపోయిందనే చెప్పొచ్చు. ఇంత మంచి రొమాంటిక్ సాంగ్ ను వినడం అస్సలే మర్చిపోకండి.
8. సమ్మోహనుడా... రూల్స్ రంజన్ సినిమాలోని ఈ పాట తెలుగు పాటలు వినే ప్రతీ ఒక్కరికీ ఫేవరెట్ గా మారిపోయింది. ముఖ్యంగా శ్రేయా ఘోషల్, అమ్రిష్ లు కలిసి పాడిన ఈ పాట అత్యంత రౌమాంటిక్ గా ఉంటుంది.
9. నచ్చావులే.. నచ్చావులే అంటూ సాగే ఈ పాటు విరూపాక్షలోనిది. అద్భుతమైన థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఈ పాట రొమాంటిక్ గా నిలిచింది.
10. ప్రేమిస్తున్నా.. బేబీ సినిమాలోని ఈ పాట కూడా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. విజయ్, పీవీఎన్ఎస్ రోహిత్ లు కలిసి పాడిన ఈ పాట కూడా టాప్ 10 బెస్ట్ రొమాంటిక్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది.


Click it and Unblock the Notifications











