Year Ender 2024 : నాగచైతన్య , కీర్తి సురేష్.. 2024లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సెలబ్రెటీలు వీళ్లే!!

మరికొద్దిరోజుల్లో క్యాలెండర్‌లో కొత్త ఇయర్ రానున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరంలో ఎన్నో చేదు, తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. వీటిని గుర్తు చేసుకుంటూ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టనుంది ప్రపంచం. మనమే కాదు.. ప్రముఖులకు కూడా 2024లో ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించింది. ఈ క్రమంలో ఈ ఏడాది కొంతమంది స్టార్స్ తమ బ్యాచిలర్‌ లైఫ్‌కు ఫుల్ స్టాప్ పెట్టి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వారెవరో? ఒకసారి చూస్తే :

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తిరుగులేని స్ధార్‌గా వెలుగొందిన రకుల్ ప్రీత్ సింగ్‌ ఈ ఏడాది పెళ్లి పీటలెక్కారు. బాలీవుడ్ నిర్మాత, తన చిరకాల మిత్రుడు జాకీ భగ్నానీతో కొన్నేళ్ల పాటు ప్రేమాయణం నడిపించిన ఆమె అతనితో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏడాడుగులు వేశారు.

Year Ender 2024 Tollywood celebrities who got married in 2024

రాజ కుటుంబీకురాలు , సినీ నటి అదితి రావు హైదరి .. హీరో సిద్ధార్ధ్‌తో సుదీర్ఘకాలంగా ప్రేమలో ఉన్నారు. ఎప్పటి నుంచో డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఈ ఏడాది తమ ప్రేమ జీవితానికి వీడ్కోలు పలికి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తెలంగాణలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది.

తెలుగులో టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు కిరణ్ అబ్బవరం తన కోస్టార్ రహస్య గోరఖ్‌‌తో ప్రేమలో పడ్డారు. కొద్దిరోజుల పాటు ప్రేమ జీవితాన్ని ఎంజాయ్ చేసిన ఈ జంట ఆగస్టులో పెళ్లి పీటలెక్కారు. తను వచ్చిన తర్వాత జీవితం పూర్తిగా మారిపోయిందన్న కిరణ్ ఇటీవల క మూవీతో పాన్ ఇండియా రేంజ్‌లో మంచి హిట్ కొట్టారు.

దక్షిణాదిలో స్టార్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న శరత్ కుమార్ గారాలపట్టి వరలక్ష్మీ శరత్ కుమార్ తన చిరకాల మిత్రుడు, బాయ్‌ఫ్రెండ్ నికోలాయ్ సచ్‌దేవ్‌తో ప్రేమలో పడి ఆయనను పెళ్లాడింది. ఇటీవలే హనీమూన్ ఫినిష్ చేసుకుని వచ్చిన ఈ జంట చెన్నైలో ల్యాండైంది.

ఈ ఏడాది పెళ్లిళ్లలో మాత్రం స్టార్ హీరోయిన్ , మహానటి ఫేం కీర్తి సురేష్ షాకిచ్చారనే చెప్పొచ్చు. తన చిన్ననాటి మిత్రుడు ఆంటోనీ తట్టితో దాదాపు 15 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. అత్యంత రహస్యంగా ప్రేమాయణం సాగించి సైలైంట్‌గా పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో గోవాలో హిందూ , క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది.

Year Ender 2024 Tollywood celebrities who got married in 2024

అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ గత కొన్నేళ్లపాటు ప్రేమించుకుని ఈ ఏడాది ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిచ్చారు. ఈ డిసెంబర్‌లో హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన వీరి విహానికి సినీ, రాజకీయ, క్రీడా రంగాల ప్రముఖులు తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించారు.

ఇక తెలుగు నాట క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా , విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సుబ్బరాజు 47 ఏళ్ల వయసులో స్రవంతి అనే అమ్మాయిని వివాహం చేసుకుని షాకిచ్చాడు. స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి నవంబర్‌లో డాక్టర్ ప్రీతి చల్లాను వివాహం చేసుకున్నారు. కలర్ ఫోటో సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్‌ రాజ్‌ను హీరోయిన్ చాందిని రావు పెళ్లాడారు.

టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ మనవరాలు రాగ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిల కుమారుడు శ్రీసంహాల వివాహం ఘనంగా జరిగింది. తమిళ హీరోయిన్ మేఘా ఆకాష్‌కు ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన విష్ణుల వివాహం సెప్టెంబర్‌లో జరిగింది. నేపథ్య గాయనీ రమ్య బెహరా - మేల్ సింగర్ అనురాగ్ కులకర్ణీల వివాహం నవంబర్‌లో జరిగింది.

More from Filmibeat

Read more about: year ender 2024 movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X