Year ender 2024: ఈ ఏడాది మొహం చాటేసిన టాప్ తెలుగు హీరోలు వీరే ..

Year ender 2024: ఈ ఏడాది బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని సినిమాలు భారీ విజయాన్ని అందుకోగా.. కొన్ని పర్వాలేదు అనిపించాయి. మరికొన్ని భారీ డిజాస్టర్ లను మూటగట్టుకున్నాయి. అయితే.. ఈ ఏడాది కొంతమంది హీరోలు తమ సినిమాలతో నిరాశ పరిచినా.. కొంతమంది హీరోలు సిల్వర్ స్క్రీన్ పై కనిపించకుండా తమ అభిమానులను నిరాశపరిచారు. అలా తమ ప్రేక్షకులకు కనిపించకుండా ఏడాది దూరంగా ఉన్న హీరోలు ఎవరో ? ఓ లూక్కెయ్యండి.

2024 లో సిని పరిశ్రమలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. చిన్న, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా మంచి కంటెంట్ ఉంటే ప్రతి సినిమాను ఆదరించారు ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంటి టాప్ హీరోలు కూడా ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఆయన పేరు చెప్తేనే.. ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి నుండి ఒక్క సినిమా కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాలేదు. వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి నటించిన 'విశ్వంభర' సినిమా ఈ ఏడాది చివరన అంటే డిసెంబర్లో విడుదల కావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాలవల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది.

రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ ఏడాది తన అభిమానుల ముందుకు రాలేకపోయాడు. వాస్తవానికి శంకర్- రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన 'గేమ్ చేంజర్' మూవీ డిసెంబర్లో విడుదల కావలసి ఉంది. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కారణంగా ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసి సంక్రాంతి బరిలో నిలిపారు. ఇలా రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ కూడా ప్రేక్షకులను నిరాశపరిచారు.

నందమూరి బాలకృష్ణ

మాసేస్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ.. ఈ ఏడాది కూడా తన ప్రేక్షకుల ముందుకి అభిమానుల ముందుకి రాలేకపోయాడు. ఈ ఏడాది చివర్లో డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తారని అందరూ భావించారు. కానీ, ఆ సినిమా వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయాలని సంక్రాంతి రేసులో విడుదల చేయబోతున్నారు వచ్చే ఏడాదిలో అఖండ 2 సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా రెండు సినిమాలతో బాలకృష్ణ తన అభిమానులను ఎంటర్టైన్ చేయబోతున్నట్లు సమాచారం.

నాగచైతన్య

గత ఏడాది 'కస్టడీ' అనే మూవీతో నాగచైతన్య తన ప్రేక్షకుల ముందుకి వచ్చారు. కానీ ఆ సినిమా నిరాశలని మిగిల్చింది . ఆ తర్వాత దూత అనే వెబ్ సిరీస్ తో ముందుకు వచ్చారు. పర్వాలేదనిపించింది. ప్రస్తుతం నాగచైతన్య 'తండేల్' అనే ఫ్యాన్ ఇండియా సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాకు చందు మొండేటీ దర్శకత్వం వహించగా.. సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ చివరి వారంలో విడుదల చేయాలని మూవీ మేకర్స్ అభిప్రాయపడ్డారు. కానీ ,అనివార్య కారణాలతో ఈ సినిమాను ఫిబ్రవరి 7 కు వాయిదా వేశారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ కు నిరాశే మిగిలిందని చెప్పాలి కానీ వచ్చాయి ఏడాదిలో ఎటు తండేలు అలాగే కార్తీక్ దండ దర్శకత్వంలో తిరక్కబోయే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు నాగచైతన్య.

అడవి శేషు

టాలీవుడ్ లో ఉన్న మరొక టాలెంట్ హీరో అడవి శేషు. విభిన్న కథ అంశాలతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న హీరోలలో అడవి శేషు ఒక్కడు. ఈ యంగ్ హీరో బిగ్ స్క్రీన్ పై కనిపించక దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది. చివరిగా మేజర్, హిట్ 2 లతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చాలా గ్యాప్ తీసుకుని గూడచారి.. సీక్వెల్ గా' జి 2 ' అనే సినిమాను ప్లాన్ చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే 'డెకాయిట్' ఏ లవ్ స్టోరీ అనే సినిమా కూడా వచ్చే సంవత్సరం ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

నితిన్

లవర్ బాయ్ నితిన్ చాలా కాలంగా హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. నితిన్' రాబిన్ వుడ్' అనే సినిమాతో ఈనెల 25న క్రిస్టమస్ కానుకగా ప్రేక్షకుల ముందుగా రావాలని ప్రయత్నించాడు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. దీంతో ఈ ఏడాది నితిన్ తెరపై కల్పించే అవకాశాలు లేనట్లే ఉంది. అలాగే తమ్ముడు ఎల్లమ్మ అనే సినిమాలలో కూడా నటిస్తున్నాడు ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్నాయి.

సాయి దుర్గ తేజ్

సాయి దుర్గ తేజ అలియాస్ సాయి ధరంతేజ్.. ఈ మెగా హీరో కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి రాలేకపోయాడు. గతంలో 'బ్రో' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆదరించిన సాయి దుర్గ తేజ. ఈ ఏడాది తన అభిమానులను పరిచారని చెప్పాలి. ప్రస్తుతం 'సంబరాల ఏటిగట్టు' అనే ఫ్యాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

Year ender 2024 Tollywood Heroes with No Movie Releases This Year

గత ఏడాది అమిగోస్ , డెవిల్ అనే సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకులు ముందుకి వచ్చాడు. కానీ ఆ సినిమా లు బెడిసి కొట్టాయి ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ తన 21 సినిమా షూటింగ్ పనులలో బిజీబిజీగా మారారు. ఇక నాగశౌర్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నవీన్ పోలిశెట్టి, అఖిల్ అక్కినేని, వైష్ణవ తేజ్ హీరోలు కూడా ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా తమ అభిమానులను పలకరించలేక పోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X