Year Ender 2024: ఏడాది టాలీవుడ్ ను వణికించిన వివాదాలు.. అల్లు అర్జున్ నుంచి నాగార్జున వరకు..

Tollywood top controversies: 2024 మరో వారం రోజులలో ఎండ్ కార్డ్ పడబోతుంది. ఈ ఏడాదిలో సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో కొన్ని సినిమాలు భారీ మొత్తంలో వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేశాయి. బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. అలాగే ఎన్నో అంచనాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన కొన్ని సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలాయి. అయితే.. అంతకుమించి అనేలా టాలీవుడ్ లో వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. వాస్తవానికి బాలీవుడ్లో వివాదాలకు కొత్తేమీ కాదు.. ఏటా ఏదోక వివాదం ఇండస్ట్రీని చుట్టూ మూడుతునే ఉంటాయి. కానీ, ఈసారి అంతకుమించి అనేలా.. వరుసగా వివాదాలు తెరమీదకి వచ్చి టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించాయనే చెప్పాలి. ఈ ఏడాది టాలీవుడ్ టాప్ కంట్రవర్సీలు ఇవే..

అల్లు అర్జున్ అరెస్ట్..

2024 లో తెలుగు చిత్ర పరిశ్రమను షేక్ చేసిన వివాదాలలో అల్లు అర్జున్ అరెస్టు సెన్సేషన్ గా మారింది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పుష్ప‌2. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. అయితే.. ఈ సినిమా ప్రీమియర్ షో సమయంలో హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ వెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. ఘటనలో రేవతి అనే ఓ మహిళ అభిమాని ప్రాణాలు కోల్పోంది. అలాగే.. ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 14 రోజుల పాటు రిమాండ్ కు తరలించగా.. బెయిల్ పై విడుదలయ్యారు అల్లు అర్జున్. అనంతరం అల్లు అర్జున్ కు సంఘీభావం తెలుపుతూ టాలీవుడ్ అంతా ఏకతాటిపై రావడం. దీనిపై తెలంగాణ ప్రభుత్వం పోలీస్ విభాగం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది.

Year Ender 2024 Tollywood top controversies Allu Arjun arrest Mohan Babu family issue Nagarjuna defamation case

నాగార్జున పరువు నష్టం కేసు

అల్లు అర్జున్ అరెస్ట్ కంటే ముందు టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. హీరో నాగార్జున .. మంత్రి కొండా సురేఖ పై వేసిన పరువు నష్టం దావా వేశారు. వాస్తవానికి కొండా సురేఖ .. మాజీ మంత్రి కేటీఆర్ ను విమర్శించే క్రమంలో నాగార్జున ఫ్యామిలీని, నటి సమంతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహానికి లోనైనా నాగార్జున.. మంత్రి కొండ సురేఖ పై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది.

కలెకన్ కింగ్ ఫ్యామిలీలో కలహాలు

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఈ ఏడాది కాంట్రవర్సీల్లో చిక్కుకొని వార్తల్లో నిలిచారు. ఈ ఏడాది అగ్ర కథనాయకుడు మోహన్ బాబు కుటుంబంలో కలహాలు చోటు చేసుకోవడంతో ఆయన వివాదం మీడియా ముందుకు వచ్చింది. ఈ సమయంలో తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయని, ఇరువురు పోలీసులకు ఫిర్యాదు అయ్యారు. ఆ వార్తను కవర్ చేయడానికి వెళ్లిన మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియాపై దాడి చేశారు. దీంతో మోహన్ బాబు పై కూడా కేసు నమోదయింది. ఆయనను అరెస్ట్ చేస్తారా? అనేది చర్చనీయంగా మారింది.

జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు

ఏడాది అత్యంత వివాదాస్పదమైన అంశాలలో జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణల కేసు కూడా ఇండస్ట్రీలో షేక్ చేసింది. జానీ మాస్టర్ .. తన వద్ద అసిస్టెంట్ గా వర్క్ చేసిన లేడీ కొరియోగ్రాఫర్ పై పలుమార్లు అత్యాచారం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడరనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో బాధిత లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జానీ మాస్టర్ను అరెస్టు చేయడం ఆ తర్వాత రిమాండ్ తరలించడం. దాదాపు నెలరోజుల పాటు బెయిల్ రాకపోవడంతో జైల్లోనే మగ్గాల్సింది. ఈ తరుణంలో జానీ మాస్టర్ కు వచ్చిన ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు ను రద్దు చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జానీ మాస్టర్ బెయిల్ పై బయటికి వచ్చారు.

రాజ్ తరుణ్ పై తన ప్రేయసి ఆరోపణలు

టాలీవుడ్ లో కాంట్రవర్సీ లలో మరో షాకింగ్ కాంట్రవర్సీ రాజ్ తరుణ్- లావణ్య ల ప్రేమ పురాణం. యంగ్ హీరో రాజ్ తరుణ్ తన భర్త అంటూ పోలీసులను ఆశ్రయించింది లావణ్య. తన భార్య కాదు .. లావణ్య తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటూ రాజ్ తరుణ్ తన వాదనను వినిపించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకోవడం. అప్పట్లో ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సినిమాను తలపించింది. ఈ కేసులో రోజుకో వీడియో, ఆడియో విడుదల చేస్తూ ఇరువురు మీడియాకు కావలసినంత మసాలా అందించారు. ఇలా ఓ నెల రోజులపాటు ఇరువురి వాదనలు కొనసాగాయి. ప్రస్తుతం ఇరు పార్టీలు సైలెంట్ అయ్యారు. అయితే.. ఈ వివాదం కాంప్రమైజ్ అయిందా? లేదా కోర్టులో తెలుసుకుంటారా?.. వేచి చూడాల్సిందే.

కాంట్రవర్సీ కామెంట్స్ తో ఆర్జీవి తిప్పలు

కాంట్రవర్సీలకు కేరాఫ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. ఈ ఏడాది ఆర్జీవి తన సంచలన ట్విట్స్, కామెంట్స్ తో వార్తల్లో నిలిచాడు. ఆ కామెంట్స్ తో కేసులలో చిక్కుకొని లీగల్ గా సమస్యలను ఎదుర్కొన్నారు ఆర్జీవి. ఏపీ ఎన్నికల సమయంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ దంపతులపై కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ పలు ట్విట్స్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ కారణంగా ఏపీలో పలు పోలీస్ స్టేషన్లలో ఆర్జీవీ పై కేసులు నమోదయ్యాయి. అతన్ని అరెస్టు చేస్తారని వార్తలు వెలువడిన తరుణంలో ఆర్జీవి.‌. పోలీసుల కంటపడకుండా తప్పించుకొని తిరిగారు. ఆ తరువాత కోర్టు జోక్యంతో రాంగోపాల్ వర్మ కు కాస్త ఊరట లభించింది అని చెప్పాలి.

డ్రగ్స్ కేసులో చిక్కిన నటి హేమ

ఈ ఏడాది టాలీవుడ్లో డ్రగ్స్ కేసు కలకలం చోటుచేసుకుంది. ఈసారి నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ డ్రగ్స్ కేసులో చిక్కుకుంది. బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో పోలీసులు దాడి చేసి హేమాను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో ఆమె డ్రగ్స్ సేవించినట్లు పోలీసులు తెలిపారు. కానీ తాను ఆ ఆ పార్టీలో పాల్గొనలేదని బుకాయిస్తూ ఓ వీడియోను మీడియాకు విడుదల చేసింది. కానీ, పోలీసులు సాక్షాధారాలను బయటపెట్టి ఆమెను అరెస్టు ఈ పరిణామంతో ఆమెపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆ సస్పెన్షన్ను ఎత్తివేయడం జరిగింది.

నాగచైతన్య- వేణు స్వామి

నాగచైతన్య - వేణు స్వామి వివాదం కూడా టాలీవుడ్ లో కొంత కాంట్రవర్సీకి క్రియేట్ చేసింది. సమంతతో విడాకులు అయిన తర్వాత నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ తరుణంలో శోభితతో నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరిగింది. వారి ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సమయంలో వీరి జంట కూడా త్వరలో విడిపోబోతుందే అంటూ వేణు స్వామి జోస్యం చెప్పారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ వేణు స్వామి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వేణు స్వామి పై పలుచోట్ల కేసు నమోదు కావడం. ఈ విషయంలో మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో కాంట్రవర్సీలో వేణు స్వామి చిక్కుకోవాల్సి వచ్చింది.‌

ఇంతే కాకుండా నటి పూనమ్ కౌర్.. టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ పై పలు సంచలన ఆరోపణలు చేస్తూ కామెంట్స్ చేసింది. తన ఫిర్యాదును మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పట్టించుకోవడం లేదంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలా టాలీవుడ్ లో వరుసగా వివాదాలు చోటు చేసుకున్నాయి దీంతో కాస్త గందరగోళ పరిస్థితులే ఏర్పడ్డాయని చెప్పవచ్చు. అయితే.. వీటన్నిటికీ ఈ ఏడాదితో ముగింపు పలికి.. కొత్త సంవత్సరంలోనైనా అంతా హ్యాపీగా సాఫీగా.. సాగాలని ఆశిస్తున్నారు మూవీ లవర్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X