Year Ender 2025: ఈ ఏడాది బోల్తా పడ్డ డిజాస్టర్ సినిమాలివే.. నిర్మాతల నెత్తిన తడిగుడ్డే..

Year Ender 2025: 2025 టాలీవుడ్‌కు ఫ్లాప్‌ల సంవత్సరంగా నిలిచిపోయింది. ఎన్నో పెద్ద, మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలై, రెండో రోజుకే థియేటర్లు ఖాళీ అయ్యాయి. కొన్నిచిత్రాలు విడుదలయ్యాయనే విషయం కూడా ప్రేక్షకులకు తెలియకుండా పోయింది. మంచి బజ్ ఉన్నా, సోషల్ మీడియాలో హైప్ ఉన్నా, రిలీజ్ తర్వాత ప్రేక్షకుల ముందుకి వెళ్లకముందే కూలిపోయిన చిత్రాలు చాలా ఉన్నాయి.ఇక ఈ ఏడాదిలో డిజాస్టర్ అనే పదం వింటే చాలా మంది కొన్ని సినిమా పేర్లు వినిపిస్తున్నాయి. వారి మైండ్లో కొన్ని సినిమాలు కనిపిస్తాయి. అందులో మొదటి వరుసలో ఉన్న సినిమాలివే..

జటాధర (Jatadhara)
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన 'జటాధర' నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోనాక్షి తొలిసారి తెలుగు సినిమాలో నటించడం, ఘోస్ట్ హంటర్ కాన్సెప్ట్ ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే విడుదల తర్వాత చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 6 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా, బ్రేక్ ఈవెన్ చేరడానికి ప్రపంచవ్యాప్తంగా ₹7 కోట్ల గ్రాస్ సాధించాల్సి ఉండగా మొదటి మూడు రోజులకే కేవలం రూ. 2 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. హర్రర్ మూవీ అయినా మౌత్ టాక్ బాగాలేకపోవడంతో క్రమంగా వసూలు పడిపోయాయి. ప్లాప్ మూవీని నిలిచింది.

Year Ender 2025 Biggest Telugu Flops amp amp Disasters Top 10 Movies That Crashed at the Box Office

ది గర్ల్‌ఫ్రెండ్ (The Girlfriend)

రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్' నాలుగు వారాల థియేట్రికల్ రన్ ముగించుకుని బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. సోషల్ మీడియాలో మంచి హైప్ ఉన్నప్పటికీ, సినిమా మొదటి రోజు కేవలం రూ. 1.3 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఆ తర్వాత కూడా పెద్దగా పుంజుకోలేకపోయింది. ఇండియాలో మొత్తం రూ.18.64 కోట్ల నెట్, రూ. 21.99 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో రూ. 7.2 కోట్ల గ్రాస్ వసూలు చేసి, ప్రపంచవ్యాప్తంగా రూ. 29.19 కోట్ల గ్రాస్‌తో రన్ ముగించింది. సినిమా బడ్జెట్ రూ. 42 కోట్లు కావడంతో, కేవలం 44% రికవరీ జరిగింది.దీంతో ట్రేడ్ పరంగా ఇది ఫ్లాప్ మూవీగా నిలిచింది.

మాస్ జాతర (Mass Jathara)

రవితేజ ప్రధాన పాత్రలో వచ్చిన 'మాస్ జాతర' బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. నాలుగు వారాల థియేట్రికల్ రన్ అనంతరం సినిమా కేవలం రూ. 18.11 కోట్లు నెట్, రూ. 21.36 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. దాదాపు రూ. 90 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా .. రొటీన్ కథనం, స్లో నరేషన్, ఊహించదగ్గ సన్నివేశాలు కారణంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 'ధమాకా' విజయానికి తర్వాత అదే కాంబినేషన్ మళ్లీ మ్యాజిక్ చేస్తుందనే ఆశించిన ప్రేక్షకులకు ఇది నిరాశనే మిగిల్చింది. ట్రేడ్ వర్గాల ప్రకారం నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లిన ఈ సినిమా, రవితేజ కెరీర్‌లో మరో డిజాస్టర్ గా నిలిచింది.

కింగ్‌డమ్ (Kingdom)
విజయ్ దేవరకొండ నటించిన స్పై యాక్షన్ చిత్రం 'కింగ్‌డమ్' (2025) బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించినప్పటికీ, చివరకు దారుణంగా పడిపోయింది. 'కింగ్‌డమ్' 13 రోజుల థియేట్రికల్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ. 108 కోట్లు గ్రాస్, రూ. 52 కోట్లు షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా రూ. 32 కోట్లు షేర్, రూ. 53 కోట్లు గ్రాస్ సాధించగా, కర్ణాటక, తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లో రూ. 12 కోట్ల షేర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ లక్ష్యం రూ. 37 కోట్లు కాగా, సినిమా కేవలం రూ.32 కోట్లు మాత్రమే రాబట్టడంతో సుమారు రూ. 5 కోట్ల నష్టం వచ్చింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ రూ. 56 కోట్లు ఉండగా, సినిమా రూ. 52 కోట్ల షేర్ తో రూ. 4 కోట్ల డెఫిసిట్‌లో నిలిచింది. సుమారు రూ. 130 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం నిర్మాతలకు రూ. 22 కోట్లకు పైగా నష్టాలు మిగిల్చిందని ట్రేడ్ వర్గాలు అంచనా.

హరి హర వీర మల్లు ( Hari Hara Veera Mallu)
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్‌ మూవీ 'హరి హర వీర మల్లు'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఇండియన్ బాక్సాఫీస్‌లో రూ. 87 కోట్లు నికర, రూ. 102.66 కోట్లు గ్రాస్ మాత్రమే రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా కలిపితే వసూళ్లు రూ.55.27 కోట్ల వద్ద ఆగిపోయాయి. ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ. 126 కోట్లు ఉండగా, సినిమా మొత్తం కేవలం రూ. 65 కోట్ల షేర్ మాత్రమే సాధించగలగడం వల్ల డిజాస్టర్‌గా నిలిచింది. బయ్యర్లకు భారీ నష్టాలు వాటిల్లాయి. కథకు మంచి స్కోప్ ఉన్నప్పటికీ, స్లో నరేషన్, విజువల్స్ అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడం మొత్తం కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం చూపించాయి. హరి హర వీర మల్లు పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యంత ఘోర వైఫల్యాల్లో ఒకటిగా నిలిచింది.

కన్నప్ప (Kannappa)
హీరో మంచు విష్ణు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన 'కన్నప్ప' బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.46 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 32.93 కోట్లు నికర, రూ. 38.85 కోట్లు స్థూల వసూళ్లతో థియేట్రికల్ రన్‌ను ముగించింది. సినిమా బడ్జెట్ రూ. 150 కోట్ల ఉన్నదని నివేదికలు సూచిస్తుండగా, కనీసం రూ.100 కోట్లకు పైగా నష్టం వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ నటులు ఉన్నప్పటికీ, కంటెంట్ లో బలంలేకపోవడం, స్క్రీన్‌ప్లే బలహీనత, స్లో నారేషన్ కారణంగా మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు.

ఓదెల 2 (Odela 2)
ఓదెల మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'ఓదెల 2' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. సుమారు రూ.12 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, తన మొత్తం థియేట్రికల్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 5.8 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. భారతదేశంలో నికర కలెక్షన్లు రూ. 5.6 కోట్లు, అంటే మొత్తం బడ్జెట్‌లో కేవలం 22% రికవరీ మాత్రమే జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బ్రేక్ ఈవెన్ సాధించడానికి కావలసిన రూ. 12 కోట్లు దూరంలో ఆగిపోయింది. సినిమా నిర్మాతలకు భారీ నష్టాలు మిగిలాయి. కథనం బలహీనంగా ఉండటం, దర్శకత్వం ప్రభావం చూపకపోవడం వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. నిర్మాతలు పోస్టర్లలో రూ. 8 కోట్ల కలెక్షన్ అంటూ ప్రచారం చేసినప్పటికీ, ట్రేడ్ పండితులు వాస్తవ క్లోజింగ్ కలెక్షన్లు ఇందుకు చాలా తక్కువని వెల్లడించారు.

రాబిన్‌హుడ్ (Robinhood)
నితిన్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రాబిన్‌హుడ్' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 27.50 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టి, బ్రేక్-ఈవెన్‌కు చాలా దూరంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 23 కోట్లు అందుకోగా..అందులో నైజాం రూ. 9.50 కోట్లు, సీడెడ్ రూ. 3 కోట్లు, ఆంధ్రా రూ. 10.50 కోట్లు వసూలు చేసింది. మిగతా కర్ణాటక, ఓవర్సీస్ కలిపి రూ. 4.50 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సినిమాకు రిలీజ్‌కు ముందు మంచి అంచనాలు ఉన్నప్పటికీ, రొటీన్ కథనం, నెగటివ్ టాక్, అలాగే 'మ్యాడ్ స్క్వేర్' వంటి సినిమాల పోటీ కారణంగా కలెక్షన్లు భారీగా దెబ్బతిన్నాయి. క్లోజింగ్ కలెక్షన్ల ప్రకారం సినిమా ట్రేడ్ వర్గాల పరంగా డిజాస్టర్ గా నిలిచింది.

గేమ్ ఛేంజర్ (Game Changer)
రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన 'గేమ్ ఛేంజర్' మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 186 కోట్లు గ్రాస్ వసూళ్లతో సెన్సేషన్ సృష్టించింది. అయితే మిక్స్డ్ టాక్ రాయడంతో రెండో రోజు నుంచే కలెక్షన్లు గణనీయంగా పడిపోయాయి. రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌ మూవీ మొత్తం థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 203 కోట్ల గ్రాస్, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.131 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.30 కోట్ల వరకు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కలెక్షన్ పరంగా డిజాస్టర్ గా మారింది. రామ్ చరణ్ స్టార్ పవర్ కారణంగా ఓపెనింగ్ బలంగా ఉన్నప్పటికీ, కంటెంట్ వీక్, స్లో నారేషన్ కారణంగా సినిమా సక్సెస్ కాలేదు. మొత్తానికి గేమ్ ఛేంజర్ భారీ హైప్‌తో ప్రారంభమైనప్పటికీ, అంచనాలను అందుకోలేక మోస్తరు వసూళ్లతోనే సరిపెట్టుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X