Year Ender 2025: ఈ ఏడాది పెళ్లి పీటలెక్కిన సెలబ్రిటీలు వీరే!

Celebrity Weddings 2025 : ఈ ఏడాది మరికొన్ని రోజుల్లో ముగియనున్నది. ఈ ఏడాది సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తమ బ్యాచిలర్ జీవితానికి శుభంకార్డు పలుకుతూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కొందరు తమ ప్రేమను పెళ్లిగా మార్చుకోగా, మరికొందరు పెద్దలు కుదిర్చిన వివాహంతో కొత్త జీవితం ప్రారంభించారు. గ్లామర్, సంప్రదాయం, ఆధ్యాత్మికత కలగలిపిన ఈ సెలబ్రిటీ వెడ్డింగ్స్‌ 2025ను ప్రత్యేకంగా నిలిపాయి.

అఖిల్ అక్కినేని - జైనబ్
అక్కినేని వారసుడు, కింగ్ నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని ఈ ఏడాది వివాహం చేసుకున్నారు. గతేడాది అన్న నాగచైతన్య పెళ్లి జరగగా, ఈ ఏడాది తమ్ముడు అఖిల్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. అఖిల్ - జైనబ్ వివాహం జూన్ 6న అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంత సహ్నితులు, కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల మధ్య వీరి పెళ్లి జరిగింది. అక్కినేని కుటుంబంలో ఈ వేడుక ఆనంద ఘట్టంగా మారింది.

Year Ender 2025 Celebrities Who Tied the Knot This Year From Akhil Akkineni to Samantha amp amp Raj Nidimoru

సమంత - రాజ్ నిడిమోరు
ఈ ఏడాది అత్యంత అనూహ్యమైన పెళ్లిగా హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహం నిలిచింది. వీరిద్దరి ప్రేమాయణంపై గత కొంతకాలంగా ఊహాగానాలు ఉన్నప్పటికీ, అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. అయితే డిసెంబర్ 1న తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఈషా యోగా సెంటర్‌లో భూతశుద్ధి పద్దతిలో వీరిద్దరూ వివాహం చేసుకుని, అందరికీ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం విశేషం.

అవికా గోర్ - మిలింద్ చంద్వానీ
'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి అవికా గోర్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న అవికా, సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానీను తాజాగా వివాహం చేసుకుంది. అవికా 2019లో మిలింద్‌ను ఓ సందర్భంలో కలిసింది. ఏడాది పాటు స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ 2020 నుంచి దాదాపు ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన అవికా, తెలుగులో 'ఉయ్యాలా జంపాలా', సినిమా చూపిస్త మావ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

అర్చన కొట్టిగె - బీఆర్ శరత్
కన్నడ సినీ రంగంలో కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంటున్న నటి అర్చన కొట్టిగె తాజాగా తన ప్రియుడు, క్రికెటర్ శరత్ ను వివాహం చేసుకుంది. వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. 2018లో అర్చన 'అరణ్యకాండ' సినిమాతో రంగప్రవేశం చేసి, వాసు నాన్ పక్కా కమర్షియల్, డియర్ సత్య, ట్రిపుల్ రైడింగ్ వంటి చిత్రాల్లో నటించింది. శరత్ 2024లో గుజరాత్ టైటాన్స్ తరపున IPLలో ఆడాడు. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు.

ఆశ్లేష సావంత్ - సందీప్ బస్వానా
హిందీ టెలివిజన్ రంగానికి చెందిన ప్రముఖ జంట ఆశ్లేష సావంత్ - సందీప్ బస్వానా దాదాపు 23 ఏళ్ల ప్రేమ ప్రయాణానికి పెళ్లితో ముగింపు పలికారు. ఈ జంట 2025 నవంబర్ 16న ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ చంద్రోదయ ఆలయంలో సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. 'క్యుంకి సాస్ భీ కభీ బహు థీ' వంటి హిట్ టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఈ జంట, బుల్లితెరపై మొదలైన పరిచయాన్ని నిజ జీవితంలోనూ ప్రేమగా మార్చుకుని ఇప్పుడు దాంపత్య బంధంలోకి అడుగుపెట్టారు.

హీనా ఖాన్ - రాకీ జైస్వాల్
బుల్లితెర నటి హీనా ఖాన్, టెలివిజన్ నిర్మాత రాకీ జైస్వాల్ దాదాపు 13 సంవత్సరాల సుదీర్ఘ ప్రేమాయణం తర్వాత 2025 జూన్ 4న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి ప్రేమకథ 'యే రిష్తా క్యా కెహ్లతా హై' సీరియల్ సెట్స్‌లో మొదలైంది. ఆ షోలో హీనా నటిగా, రాకీ సూపర్‌వైజింగ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తూ ఇద్దరూ దగ్గరయ్యారు. సుమారు 13 ఏళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట, ఎన్నో జీవిత దశలను కలిసి ఎదుర్కొంది. ముఖ్యంగా హీనా ఖాన్‌కు స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ అయిన సమయంలో, రాకీ ఆమెకు అండగా నిలిచి తన ప్రేమను నిరూపించారు. రాకీ జైస్వాల్ రచయిత, దర్శకుడు, నిర్మాతగా టెలివిజన్ పరిశ్రమలో గుర్తింపు పొందారు.

అభిషన్ జీవింత్ - అఖిల
'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమాతో దర్శకుడిగా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు అభిషన్ జీవింత్ ఇటీవల తన చిన్ననాటి ప్రేయసి అఖిలను వివాహం చేసుకున్నారు. వీరిద్దరిది చాలా కాలంగా కొనసాగుతున్న ప్రేమకథ కాగా, పెద్దల అంగీకారంతో ఈ ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ వర్గాల కొద్దిమంది మిత్రుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా ఈ వేడుక జరిగింది. ఈ వివాహం ఇండస్ట్రీలో ప్రత్యేక చర్చకు దారి తీసింది.

అర్మాన్ మాలిక్ - ఆష్నా ష్రాఫ్
ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్, ఫ్యాషన్ ఇన్‌ఫ్లూయెన్సర్ ఆష్నా ష్రాఫ్ తమ ప్రేమ బంధానికి వివాహంతో ముగింపు పలికారు. ఈ జంట 2025 జనవరి 2న మహాబలేశ్వర్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. అర్మాన్ మాలిక్ భారతీయ సంగీత ప్రపంచంలో తనదైన గుర్తింపు సంపాదించిన గాయకుడు, పాటల రచయిత, రికార్డ్ ప్రొడ్యూసర్. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో పాటలు పాడి కోట్ల అభిమానులను అందుకున్నారు. ఆష్నా ష్రాఫ్ ముంబైకి చెందిన ఫ్యాషన్ క్రియేటర్, బ్లాగర్, మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ప్రసిద్ధి చెందింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X