బూతు కంటెంట్, శృంగార సీన్లు... సంచలనం రేపుతున్న ట్రైలర్!

Recommended Video

Yedu Chepala Katha Official Trailer 2 | Filmibeat Telugu

'ఏడు చేపల కథ' పేరుతో ఆ మధ్య విడుదలైన ఓ సినిమా టీజర్ ఇంటర్నెట్లో సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అడల్ట్ కామెడీ కాన్సెప్టుతో వస్తున్న సినిమా కావడం, ఇప్పటి వరకు తెలుగులో ఎన్నడూ లేని విధంగా శృంగార సీన్లు ఉండటంతో భారీ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా 'ఏడు చేపల కథ' చిత్రానికి సంబంధించి మరో ట్రైలర్ విడుదల చేశారు. మూవీ రిలీజ్ కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో... ఈ సినిమా గురించి ఎవరూ మరిచపోకుండా, హైప్ అలాగే కొనసాగించేందుకు సెకండ్ ట్రైలర్ వదిలారు.

బూతు డోసు పెంచేశారు

బూతు డోసు పెంచేశారు

తాజాగా విడుదలైన ట్రైలర్లో బూతు డోసు మరింత పెంచారు. మొదటి ట్రైలర్లోనే శృుంగార సీన్లు భరించలేని స్థాయిలో ఉన్నాయంటే... తాజాగా విడుదలైన ట్రైలర్లో హద్దులు దాటిన పరిస్థితి కనిపించింది. యువతను ఆకర్షించడమే లక్ష్యంగా అడల్ట్ కంటెంటుతో ఈ చిత్రం రాబోతోందని స్పష్టమవుతోంది.

హీరో బలహీనత చుట్టూ...

హీరో బలహీనత చుట్టూ...

ఈ చిత్రంలో అభిషేక్ పచ్చిపాల హీరోగా నటించాడు. ఇందులో అతడి పాత్ర పేరు టెమ్ట్ రవి... అమ్మాయిలు అతడి ముందు కాస్త ఎక్స్‌ఫోజ్ చూస్తే చాలు కోరికలతో రగిలిపోతాడు. ఇది అతడికి వీక్‌నెస్. అదొక సమస్యగా మారడంతో వైద్యులను సంప్రదిస్తాడు, అయితే వారు కూడా దీనికి మందు లేదు అంటూ చేతేలెత్తేయడం ట్రైలర్లో ఫన్నీ యాంగిల్‌లో చూపించారు.

రివర్స్ యాంగిల్

రివర్స్ యాంగిల్

సాధారణంగా అబ్బాయిలు వారి కోరికలు తీర్చుకోవడానికి అమ్మాయిల వెంట పడటం చూస్తాం... ఇందులో అందుకు భిన్నంగా చూపించారు. టెమ్ట్ రవి వీక్‌నెస్ తెలుసుకున్న కొందరు మహిళలు అతడిని కావాలనే రెచ్చగొట్టి... వద్దంటున్నా బలవంతంగా కామ సుఖాన్ని తీర్చుకుంటున్న సీన్లు ట్రైలర్లో కనపించాయి.

‘ఏడు చేపల కథ’ టీజర్ 2

జివిఎన్ శేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ జె చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరి ‘ఏడు చేపల కథ' వెనక ఉన్న అసలు స్టోరీ ఏమిటి? టెమ్ట్ రవి సమస్య ఎలాంటి అనర్దాలకు దారి తీసింది అనేది తెరపై వినోదాత్మకంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అభిషేక్, భానుశ్రీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X