నాకు వేధింపులు తప్పలేదు... క్యాస్టింగ్ కౌచ్ పై అనుష్క సంచలన వ్యాఖ్యలు
అందాల బొమ్మ అనుష్క కొత్త సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని జనాలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుమారు దశాబ్ధిన్నర కెరీర్ ను విజయవంతంగా కొనసాగించిన స్వీటీ గురించి ఎప్పుడూ ఎలాంటి కాంట్రావర్శీ వినిపించలేదు. ఆన్ స్క్రీన్ పై నటనా పటిమతోనూ, ఆఫ్ స్క్రీన్ లో తన మంచితనంతోనూ జనాలను ఆకట్టుకుంటోన్న అనుష్క, తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించి సంచలనం సృష్టించింది.
కెరీర్ తొలినాళ్లల్లో తనకు చేతు అనుభవాలు ఎదరయ్యాయని అనుష్క వెల్లడించింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సంప్రదాయం ఉందని, టాలీవుడ్ లో ఆఫర్ల కోసం ప్రయత్నిస్తున్నప్పుడూ తాను కూడా దీని వల్ల ఇబ్బంది పడ్డానని స్పష్టం చేసింది. ప్రస్తుతం టాప్ పొజిషన్ కు చేరుకున్నాక అలాంటి పరిస్థితులు ఎదురుకాలేదని తెలిపింది. అయితే, మొదటినుంచీ, తన ధృఢ సంకల్పంతోనూ, ముక్కుసూటిగా వ్యవహరించే గుణం వల్లనూ క్యాస్టింగ్ కౌచ్ బారిన పడకుండా నెట్టుకురాగలిగానని స్పష్టం చేసింది అనుష్క.

ప్రస్తుతం అనుష్క నటించిన నిశబ్ధం ఓటీటీపై విడుదలకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో పాలుపంచుకున్న అనుష్క, ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై జరుగుతున్న చర్చపై స్పందించింది. ఈ సంప్రదయానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేనని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఏమైనా మొత్తానికి అనుష్క వెల్లడించిన వాస్తవాల వల్ల రానున్న రోజల్లో ఎంతమంది ప్రభావితమవుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











