90ML వేసిన కార్తికేయ.. అమ్మాయిల గురించి అంతా చెప్పేశాడుగా!
Rx100 సినిమాతో తెలుగు తెరపై కాలుమోపి యువత మనసు దోచేశాడు యంగ్ హీరో కార్తికేయ. ఈ సినిమాలో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌తో కలిసి ఆయన చేసిన రొమాన్స్ హైలైట్ కావడంతో మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో వరుస సినిమా అవకాశాలు పట్టేస్తూ క్రమంగా తన టాలెంట్ బయట పెడుతున్నాడు కార్తికేయ. ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న తాజా సినిమా 90ML.
శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కార్తికేయ రోల్ ప్రత్యేక ఆకర్షణ కానుందని తెలుస్తోంది. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి అశోక్ గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ చిత్రం నుంచి తాజాగా లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. అమ్మాయిల గురించి చెబుతూ సాగిపోతున్న ఈ సాంగ్ యువ హృదయాలను బాగా ఆకర్షిస్తోంది.

ఇనిపించుకోరు.. ఇనిపించుకోరు అంటూ అమ్మాయిల తీరు చెబుతున్న ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా, రాహుల్ సింప్లిగంజ్ ఆలపించారు. అనూప్ రూబెన్స్ సంగీతం బాణీలు కట్టారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్తికేయ, నేహా సోలంకి, రవికిషన్, రావు రమేష్, అలీ, పోసాని కృష్ణ మురళి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అతి త్వరలో 90ML తో ప్రేక్షకులకు మాంచి కిక్కివ్వనున్నాడు కార్తికేయ. హిప్పీ, గుణ 369 వంటి వరుస పరాజయాల తరువాత కార్తికేయను 90ML హిట్ ట్రాక్ హిట్ ట్రాక్ ఎక్కించనుందని తాజా అప్‌డేట్స్ తెలియజేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











