twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుట్టుచప్పుడు కాకుండా టాప్ కమెడియన్ పెళ్లి.. ఫోటోలు వైరల్

    |

    ఈ మధ్య సెలెబ్రిటీలు పెళ్లి వ్యవహారాలను అత్యంత ఆర్భాటంగా చేస్తోన్న సంగతి తెలిసిందే. సెలెబ్రిటీ ఇంట పెళ్లి అంటే.. అందరి దృష్టి అటువైపే ఉండేలా కొత్త కొత్త పద్దతుల్లో పెళ్లిని జరుపుతున్నారు. ఇంకా కొందరు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటూ ప్లాన్ చేస్తున్నారు. ఎంతో బిజీగా ఉండే తమిళ కమెడియన్ యోగిబాబు వీటన్నంటికి దూరంగా ఉండి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నాడు.

     దేవాలయంలో పెళ్లి..

    దేవాలయంలో పెళ్లి..

    తమిళ టాప్ కమెడియన్ యోగి బాబు ఓ ఇంటి వాడయ్యాడు. తమిళనాడులోని వెల్లూరుకు చెందిన మంజు భార్గవిని నేడు (ఫిబ్రవరి 5) వివాహం చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకు సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. కుటుంబ సంప్రదాయం ప్రకారం తమిళనాడు తిరుతనిలోని ఓ దేవాలయంలో ఈ వివాహం జరిగినట్టు తెలుస్తోంది.

    సీక్రెట్ మ్యారెజ్..

    సీక్రెట్ మ్యారెజ్..

    కాగా యోగిబాబు తన వివాహం విషయాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచాలని ప్రయత్నించినట్టు టాక్. మీడియాకు ఏ మాత్రం దొరక్కుండా సన్నిహితుల మధ్య ఈ వివాహాన్ని చేసుకోవడం విశేషం. కాగా ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అని తెలుస్తోంది.

    గ్రాండ్‌గా రిసెప్షన్..

    గ్రాండ్‌గా రిసెప్షన్..

    పెళ్లి మాత్రం బంధువుల సమక్షంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా జరిగినా.. రిసెప్షన్ మాత్రం అత్యంత గ్రాండ్‌గా జరగబోతోన్నట్లు టాక్. వచ్చే నెల చెన్నైలో సినీ ప్రముఖుల సమక్షంలో ఓ గ్రాండ్ పార్టీ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

    టాప్ హీరోలకు మంచి చాయిస్..

    టాప్ హీరోలకు మంచి చాయిస్..

    తమిళ స్టార్ హీరోల చిత్రాల్లో ఒకప్పుడు వడివేలుకు ఎంతటి ప్రాధాన్యం ఉండేదో.. ప్రస్తుతం యోగిబాబుకు అంతటి క్రేజ్ ఉంది. ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే అందులో యోగిబాబు ఉండాల్సిందేనన్న చందంగా మారింది. విజయ్, అజిత్, రజినీ ఇలా స్టార్ సినిమాల్లో నటిస్తూ యమా బిజీగా మారిపోయాడు. తాజాగా దర్బార్ చిత్రంలో రజినీ పక్కన నటించాడు.

    English summary
    yogi babu got married with manju Bhargavi. Popular Tamil Comedy Actor YogiBabu got married to #ManjuParkavi at his ancestral temple early this morning.. A grand wedding reception will be held in March in Chennai..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X