హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న సినీ నటి.. ఏం జరిగిందంటే..?
ప్రస్తుత కాలంలో చాలా మంది సినీ నటులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పేరు రాలేదనో, మానసిక ఒత్తిడిని మేనేజ్ చేయలేకనో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకుంది. భోజ్ పురి నటి ఆకాంక్ష దూబే సూసైడ్ చేసుకుంది.
ఆకాంక్ష మీర్జాపూర్ లోని వింధ్యాచల్ లో జన్మించింది. అయితే ఆమె తన తల్లిదండ్రులతో 3 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఆమె కుటుంబంతో కలిసి ముంబయికి షిఫ్ట్ అయ్యారు. ఆకాంక్ష తండ్రి వ్యాపారవేత్త, తల్లి గృహిణి. ఆమెకు ఆదిత్య, హరి అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. అక్కడే పాఠశాల విద్యను పూర్తి చేశారు. అయితే ఆకాంక్ష కుటుంబ సభ్యులు ఆమెను ఐపీఎస్ గా చూడాలనుకున్నారు. కానీ ఆకాంక్షకు మాత్రం చిత్ర సీమలో ఉండాలని కోరుకుంది. తన కోరిక కష్టపడి అవకాశాలు దక్కించుకుంది.

మేరీ జంగ్ మేరా పైస్లా అనే సినిమాతో ఆకాంక్ష తెరంగేట్రం చేసింది ఆకాంక్ష దూబే. అందులో ఓ చిన్న అతిథి పాత్రలో నటించింది ఆకాంక్ష. ఆమె ముజ్సే షాదీ కరోగి అనే భోజ్ పురి చిత్రంలో, వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్, కసమ్ పైడా కర్నే KI 2లో కూడా ఆకాంక్ష దూబే కనిపించింది. ఈ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. చిన్న వయస్సులోనే తన నటనా నైపుణ్యంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఆకాంక్ష దూబే.
ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ హ్యాపీ వాలెంటైన్స్ డే అని రాసింది. సమర్ సింగ్ అనే సహ నటుడితోనే ఆకాంక్ష దూబే రిలేషన్ షిప్ లో ఉంది. ఇందుకు సంబంధించి తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ పోస్టు చేసింది. అయితే అసలు ఆకాంక్ష దూబే ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది. సమర్ సింగ్ తో బంధం చెడిపోవడం వల్ల మానసికంగా కుమిలిపోయిన సూసైడ్ చేసుకుందా.. లేదా అవకాశాలు లేక ఒత్తిడి అనుభవించిందా అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











