యంగ్ డైరెక్టర్లు మెచ్చిన 'దొరసాని'.. ఫస్ట్ రివ్యూ

కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దొరసాని'. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా నటించారు. హిస్టారికల్ లవ్ స్టోరీగా చాలా ఏళ్ల క్రిందటి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్‌బెన్ సినిమాస్ బ్యానర్లపై యశ్‌ రంగినేని, మధురా శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మించారు. చిత్రానికి దగ్గుబాటి సురేశ్‌బాబు సమర్పకుడిగా వ్యవహరించారు. ప్రశాంత్‌ ఆర్‌ విహారి సంగీతం సమకూర్చారు. ఈ రోజు (జులై 12) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

విడుదలకు ముందే దొరసాని

విడుదలకు ముందే దొరసాని

కాగా విడుదలకు ముందుగానే 'దొరసాని' చిత్రాన్ని చూసిన యంగ్ డైరెక్టర్స్ కొందరు తమ తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. టీజర్, ట్రైలర్ పరంగా దొరసాని సినిమాపై ఇప్పటికే నెలకొన్న అంచనాలను రెట్టింపు చేస్తూ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందంటూ పొగిడారు.

నాచురల్ నటన

గత రాత్రి దొరసాని సినిమా చూశాను. చాల బాగుంది. నటీనటులంతా నాచురల్ రోల్స్‌లో నాచురల్ గా నటించారు. డైరెక్టర్ కేవీ మహేంద్ర టేకింగ్ బాగుంది. ఓ తెలంగాణ సినిమా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ కేవీ మహేంద్ర అని యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ పెట్టాడు.

వేణు అడుగుల రెస్పాన్స్

దొరసాని చిత్రంలో నటీనటుల నటన, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం అన్ని శాఖలు ఒకదాన్ని ఒకటి కాంప్లిమెంట్ చేసుకున్నట్లుగా ఉంది. గత రాత్రి ఈ సినిమా చూశాను. బాగుంది.. అని వేణు అడుగుల ట్వీట్ చేశాడు.

గౌతమ్ తిన్ననూరి రియాక్షన్

దొరసాని సినిమా చూడటం ఆనందంగా ఉంది. ఇంటెన్స్ అండ్ అథెంటిక్ డ్రామా ఇది. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక సహా నటీనటులంతా బాగా యాక్ట్ చేశారు. గుడ్ లక్.. అని గోయితం తిన్ననూరి ట్వీట్ పేర్కొన్నాడు.

హీరోహీరోయిన్ల నటన బాగుంది.. అజయ్ భూపతి

దొరసాని చూశాను.. హీరో హీరోయిన్లు ఆనంద్ దేవరకొండ, శివాత్మిక మంచి నటన కనబర్చారు. డైరెక్టర్ కేవీ మహేంద్ర టేకింగ్ బాగుంది. విజువల్స్, మ్యూజిక్ ప్రొడక్షన్ విలువలకు అడ్డం పట్టాయి. అల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్.. అని అజయ్ భూపతి ట్వీట్ పెట్టాడు.

సందీప్ రెడ్డి వంగా విషెస్

కబీర్ సింగ్ రూపంలో మరో సక్సెస్ సాధించిన సందీప్ రెడ్డి వంగా దొరసాని టీమ్ ని విష్ చేశారు. మొదటి సినిమాతోనే ఆనంద్ దేవరకొండ సక్సెస్ కావాలని ఆయన కోరుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X